

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఆగస్టు 11:

భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడి ఇంటిపై వేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలనీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పురజనులకు పిలుపునిచ్చారు.

సోమవారం స్థానిక పురపాలక సంఘం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ అభియాన్ ర్యాలీని మున్సిపల్ కార్యా లయం నుండి గడియా రపు స్తంభం వరకు నిర్వహించా రు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశభక్తిని ఉద్దేశం తో హర్ ఘర్ తిరంగ కార్యక్రమా న్ని ఈనెల 3 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు నిర్వహిస్తు న్నార న్నారు భారతదేశానికి స్వాతం త్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగం గా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్ర మాన్ని ప్రారంభించిందన్నారు.

దీని ద్వారా ప్రతి పౌరుడిలో దేశం పట్ల ప్రేమ, గౌరవం, దేశభక్తి భావనలను పెంపొందించాల న్నారు. స్థానిక శాసనసభ్యులు అ యితా బత్తుల ఆనందరావు మాట్లాడుతూ జాతీయ జెండా తో మనకున్న సంబంధాన్ని కేవలం అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేయకుం డా, దానిని వ్యక్తిగతమైన, హృ దయ పూర్వకమైన అను బం ధంగా మార్చుకోవాల న్నారు ఈ కార్యక్రమం ద్వారా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి చురుకుగా పాల్గొనే లా ప్రోత్సహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభు త్వం పోస్టాఫీసుల ద్వారా, ఇతర మార్గా ల ద్వారా జాతీయ జెండా లను అందుబాటులోకి తెస్తుం దనీ ప్రజలు తమ ఇళ్లపై జెండాను ఎగురవేసి, ప్రతి ఒక్కరూ దేశ దేశభక్తిని చాటా లన్నారు. ఈ ప్రదర్శన వలన యువతకు విద్యార్థులకు దేశభక్తి భావన పై అవగాహన ఏర్పడు తుందన్నారు. అసలు త్రివర్ణ పతాకాన్ని మనం ఎందుకు ఎగురవేసుకుంటున్నామో దాన్ని సాధించడానికి అంటే ఈ దేశానికి స్వాతంత్రాన్ని సాధించడానికి ఎంత మంది త్యాగధనులైన అమరవీరులు తమ ప్రాణాల్ని ప ణంగా పెట్టి బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి తరిమారో ఆ వీరుల ను ఈ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ తెలుసుకొని అటువంటి దేశభక్తి కలిగి ఉండాలని లక్ష్యంతోనే ప్రతి సంవత్సరం ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రభుత్వ నిర్వహిస్తుంద న్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వి నిర్మల్ కుమార్, డి ఈ సత్యనారాయణ, తాసిల్దార్ అశోక్ ప్రసాద్, స్థానిక ప్రజా ప్రతినిధులు వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.