ఎస్ యానం బీచ్ లో ఎమ్మెల్యే ఆనందరావు సందడి.

నేరేడుమిల్లి వినయ్ కుమార్.V9 ప్రజాయుధం మీడియా సంస్థ చైర్మన్ మరియు ప్రముఖ ఆన్ లైన్ రిపోర్టర్.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జనవరి 14:


అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు చల్లపల్లి యానం బీచ్ లో మంగళవారం సందడి చేశారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనందరావు సమక్షంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు ఎస్ యానాం బీచ్ రెండో రోజు యధావిధిగా నిర్వహించారు.

బీచ్ వద్ద భారీ పందిర్లు ఏర్పాటు చేసిన రంగు రంగుల విద్యుత్తు దీప కాంతులకు, ఉత్సాహంతో తరలివచ్చిన ప్రజానీకం ఆకట్టుకున్నారు. అదేవిధంగా సినీ ఆర్కెస్ట్రా ప్రదర్శనలు ఇచ్చారు. పలు రాష్ట్రాల నుండి ఇక్కడకు వేలాదిగా ప్రేక్షకులు విచ్చేసి బీచ్ సముద్ర యెక్క అందాలను తిలకిస్తూ ఆస్వాదించారు.

ఇంతటి చూడ ముచ్చటగా ఉత్సవ సంబరాలను జరిపిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు ను అందరూ అభినందిస్తున్నారు. అంతేకాకుండా అమలాపురంలో ఈ బీచ్ ను అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే ఉత్సాహంగా అక్కడ విచ్చేస్తున్న అందరిని పలకరిస్తూ సందడి చేస్తున్నారు.

కొందరు ఆంధ్ర గోవా బీచ్ అని, ఎమ్మెల్యే ఆనందరావు బీచ్ అంటూ చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఇక్కడ రాష్ట్ర మొదటి స్థానంలో పర్యటక ప్రాంతంగా ఆనందరావు తీర్చి దిద్దుతారనే నమ్మకం కలుగుతుందని అక్కడికు విచ్చేసిన అందరిలో ఇదే మాట గా చర్చనీయంగా మారింది.

Related Articles

ప్రతి ఎకరాకి సాగునీరు//కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం, మార్చి 24: ప్రతి ఎకరాకి సాగునీరు అందించేలా అధికారులు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ […]

డిసి అధ్యక్షుడు శ్రీనివాస్ ను అభినందించిన టిడిపి లీగల్ సెల్ భాస్కర్ జోగేష్.

డిసి అధ్యక్షుడు శ్రీనివాస్ ను అభినందించిన టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు బడుగు భాస్కర్ జోగేష్. అయినవిల్లి సాగునీటి వినియోగదారులు సంఘ(డి.సి) అధ్యక్షుడిగా ఎన్నికైన కాకర శ్రీనివాసరావుకు టిడిపి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు […]

ఎస్సీ ఎస్టీ నర్సింగ్ మహిళలకు జర్మనీ భాష నందు ఉచిత శిక్షణ:పి జ్యోతిలక్ష్మి దేవి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 26: ఎస్సీ ఎస్టీ నర్సింగ్ మహిళలకు జర్మనీ భాష నందు ఉచిత శిక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని డాక్టర్ […]

బంగారు కుటుంబాలను దత్తతనిస్తూ 2029 నాటికి జీరో పేదరికమే ధ్యేయంగా

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 25: ఆర్థిక అసమానతలను మాపేందుకు మార్గదర్శకుల సహకారంతో బంగారు కుటుంబాలను దత్తతనిస్తూ 2029 నాటికి జీరో పేదరికమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ […]