
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – పి.గన్నవరం మే 20:

ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను రజిని మర్యాదపూర్వకంగా కలిశారు.మాతా రమాబాయి అంబేద్కర్ ఫౌండేషన్ చైర్ పర్సన్ పుణ్యమంతుల రజనీ తన బృందంతో పి. గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ను జనసేన పార్టీ కార్యాలయం గన్నవరంలో మంగళవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకకు దూరంగా ఉండటం వల్ల ఈరోజు మంగళవారం మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి చిరు సత్కారం చేయటం జరిగిందని రజిని అక్కడు వచ్చిన V9 మీడియాకు తెలిపారు.

ఈ సందర్భంలో మహిళా సమస్యలను ఎమ్మెల్యే గిడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపింది. శాసనసభ్యులు గిడ్డి సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులతో మాట్లాడినట్లు మీడియా గమనించింది.