డాక్టర్ పి ఎస్ శర్మ కు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అభినందనలు

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, మార్చి 03:

56 దేశాల సభ్యత్వం కలిగిన కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ లో క్షయ వ్యాధి నివారణ కొరకు 12 మంది సభ్యుల తో ఏర్పాటుచేసిన ఉప సంఘంలో భారతదేశం నుంచి ముగ్గురు డాక్టర్లను ఎంపిక చేయడం జరిగిం దని వారి ముగ్గురిలో జిల్లా నుండి డాక్టర్ పి ఎస్ శర్మ సభ్యులుగా ఉండ డం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. సోమ వారం ఈ మేరకు జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ నందు క్షయ వ్యాధి అపోహ నిర్మూలన గురించి ముద్రించిన ముద్రికను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్మూలన ఉప సంఘంలో మన రాష్ట్రా నికి చెందిన అమలాపు రం వాస్త వ్యులైన డాక్టర్ పి ఎస్ శర్మకు అవకాశం లభించడం హర్ష నీయమ న్నారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ డాక్టర్ శర్మకు అభినందనలు తెలుపు తూ క్షయ వ్యాధి నివారణ అందరి బాధ్యత అని ప్రతి పౌరుడు క్షయ వ్యాధి నివారణకు కృషి చేయాలని తెలిపారు ఈనెల 17వ తేదీన జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణంలో సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన క్షయ వ్యాధి నిర్మూలన గురించి అవ గాహన కార్యక్రమం ప్రజలతో ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ పి ఎస్ శర్మ తెలిపారు ప్రతి ఒక్కరూ యొక్క అవగాహన సదస్సుకు హాజరై క్షయ వ్యాధి పట్ల ప్రజలకు ఉన్న అపోహలను సందేహాల ను నివృత్తి చేసుకునేందుకు చక్కటి వేదికన్నారు.

Related Articles

ముమ్మిడివరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి నిధులు మంజూరు : ఎంపీ హరీష్, బుచ్చిబాబు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం జూలై 08: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి సి ఎస్ ఆర్ నిధుల […]

కేంద్ర ప్రభుత్వం” డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సర్వే

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 25: పెట్టుబడులకు అనుకూల మైన వాతావరణం సృష్టి చేందుకుగాను వివిధ రాష్ట్రాల మధ్య పోటీ తత్వాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ […]

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి/ఎంపీ హరీష్ ఎమ్మెల్యే దాట్ల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – తాళ్ళు రేవు జూలై 18: హైవే అధికారులకు,యానాం మున్సిపల్ కమిషనర్ కు సూచించిన ఎంపీ హరీష్, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు డాక్టర్ బీ […]

అఖండ గోదావరి నది ప్రాంతం ప్రకృతి అందాలు, రమణీయత ఎంతో ఆహ్లాదకరం: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ఆత్రేయపురం డిసెంబర్ 21: అఖండ గోదావరి నది ప్రాంతం ప్రకృతి అందాలు, రమణీయత మధ్య ఎంతో ఆహ్లాదకరంగా పర్యాటకులను కను విందు చేస్తోoదని డాక్టర్ […]