
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం ఆగస్టు 11:

ఫిర్యాదు దారుల సమస్యల కు నిర్ణీత గడువు లోగా సంతృప్తి కొలమా నంగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. ప్రతి సోమ వారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లోని గోదావరి భవన్ నందు జిల్లా కలెక్టర్ జాయిం ట్ కలెక్టర్ టీ నిశాంతి, ప్రజల నుండి వినతులను స్వీకరిం చారు. జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ పిజి ఆర్ఎస్ లో నమోదయ్యే అర్జీలు పెం డింగ్ లేకుండా సకాలంలో పరిష్కరించాలన్నారు.

జిల్లా స్థాయి అధికారులు ప్రతి రోజు పిజిఅర్ఎస్ పోర్టల్ లాగిన్ అయి వారి శాఖకు సంబందించిన వినతులను చూడాలని, అలాగే రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగిం చాలని తెలిపారు. అర్జీల ను అవసరమైతే క్షేత్రస్థా యిలో పరిశీలించి నాణ్య మైన పరిష్కారం చూపాల న్నారు. జిల్లాస్థాయి అధికా రులు,అర్జిదారులతో మర్యా ద పూర్వకంగా మాట్లాడాల ని, సవివరమైన ఎండార్సు మేంట్ ఇవ్వాలని, గడువు లోపలే వినతులకు పార దర్శక, నాణ్యమైన సమా ధానాలు పంపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లా డుతూ పిజిఆర్ఎస్ లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు.

ఈసందర్భంగా వివిధ సమ స్యల పరిష్కారానికి ప్రజల నుంచి 167 అర్జీలు అందా యన్నారు శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించేందుకు అవసర మైన చర్యలు చేపట్టాల న్నారు. అర్జీల పరిష్కా రంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యా నికి తావు లేకుండా అధి కారులు, ఉద్యోగులు అంకి త భావంతో జవాబుదారీత నంతో పనిచేయాలని సూచించారు.

పీజేఆర్ ఎస్ లో ప్రజల నుంచి అందిన అర్జీల పరిష్కార సరళిపై ప్రధానంగా దృష్టి సారిం చాలన్నారు.పి జి ఆర్ ఎస్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉత్పన్న మయ్యే సమస్యలకు
క్షేత్ర స్థాయిలోనే మంచి పరిష్కార మార్గాలు చూపిం చి అర్జీలు రీఓపెనక్కు ఆస్కారం లేకుండా చూ డాలన్నారు.

ఈ కార్యక్రమం లో డిఆర్ఓ కొత్త మాధవి, డ్వామా పిడి ఎస్ మధుసూ దన్, సమగ్ర శిక్ష ఏపీసి జి మమ్మీ, ఎస్ డి సి, పి కృష్ణమూర్తి, డీఎస్ఓ ఉదయ భాస్కర్ తదిత రులు పాల్గొన్నారు.
