V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 13:
జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతిను మర్యాద పూర్వకంగా కలిసిన ఏపీసీ మమ్మీ.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా జి.మమ్మీ నియామకం పొందారు. ఇప్పటి వరకు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా ఏపీసీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఏపీసీగా మమ్మీని నియమిస్తూ సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టరు శ్రీనివాసరావు ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీసీగా మమ్మీ బాధ్య తలు స్వీకరించిన అనంతరం మంగళవారం ఆమె జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషాను మ ర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీసీ మమ్మీ మాట్లాడు తూ సమగ్ర శిక్షా ఆధ్వ ర్యంలో జరుగుతున్న పథకాలను సమర్ధవంతం గా నిర్వహించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.