రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సమక్షంలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం ఆగస్టు 07:

చేనేత రంగానికి జవసత్వా లు తీసుకుని వచ్చి పూర్వ వైభవం సంతరింప జేసేందు కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపట్టిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. గురువారం స్థానిక మండల పరిధిలోని ఆదివారపు పేట గ్రామంలో 11 వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తో కలిసి మగ్గాల యూనిట్లను పరిశీలించారు అనంతరం ఏర్పాటుచేసిన సభలో ప్రసంగిస్తూగత కొంతకాలంగా నిర్లక్ష్యం చేయబడిన చేనేత రంగానికి రాష్ట్ర ముఖ్య మంత్రి జవసత్వాలు తీసుకొచ్చేందుకు మగ్గానికి 200, మరమగ్గానికి 500 యూనిట్లు విద్యుత్ రాయి తీని ప్రకటించడంతో జిల్లా లో 60 లక్షలు రూపాయలు దీని ద్వారా లబ్ధి చేపడుతుందన్నారు.

త్రిప్టు రుణాలు మంజూరు చేస్తూ ఆప్కో ద్వారా విక్రయాలు మరలా పునరు ద్ధరించేందుకు చర్య లు చేపట్టడంతో పాటు నూలు పై సబ్సిడీ ఇస్తూ చేనేత వస్త్రాల విక్రయాలపై ఐదు శాతం జీఎస్టీ మినహా యింపు కల్పించడం జరిగిందన్నారు. వీటికి అదనంగా ముఖ్యమంత్రి చొరవతో నేతన్న నేస్తం కింద మరో రూ 25 వేలు ఆర్థిక సహాయాన్ని అందించేందు కు కృషి చేస్తున్నట్లు చెప్పా రు. ఈ నెల 16వ తేదీ చేనేత రంగ మంత్రి సమక్షంలో మరిన్ని సమస్యల పరిష్కారానికై సమావేశం నిర్వహించి తగు నిర్ణయాలు గైకొనడం జరుగుతుందన్నారు.

చేనేత కార్మికులు తమ ప్రభుత్వా నికి వెన్నెముకగా నిలిచారని వారి సంక్షేమానికి అన్ని విధాలుగా ముఖ్య మంత్రి ప్రత్యేక చొరవతో కృషి చేయడం జరుగుతుందన్నారు. ముద్రా రుణాల కింద నేతన్న లకు రుణాల ను పంపిణీ చేశారు. తొలు త గాంధీజీ చిత్ర పటా నికి పూలమాలలు అలంకరించి అందరికీ 11 వ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగానికి సంక్షేమం తో పాటు అభివృద్ధికి పెద్దపీట వేసి ఏడాది పాటు ఉపాధి కల్పనకై నేతన్నల ఆర్థిక అభివృద్ధికి పథకాల రూ పొందించడం జరిగిందన్నారు. 50 ఏళ్లు వయసు పైబడిన నేతన్నలకు రూ 4వేల పింఛన్ అందిస్తున్నామన్నారు.,

నూలు కొను గోలుపై సబ్సిడీ కల్పించడం క్లస్టర్ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి వీవర్స్ శాలల నిర్మాణాలకు ప్రభుత్వం ప్రణాళికా యుతంగా ముందుకు సాగుతుంద న్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చేనేత వస్త్రాలు వినియోగం పెంచడానికి ప్రత్యేక దృష్టి పెట్టామ న్నారు. చేనేత కార్మికుల నైపుణ్యం వెలికి తీసే ఉద్దేశంతో నూతన డిజైన్లు దరఖాస్తులు ప్రభుత్వం ఆహ్వానిస్తుందన్నారు ఒక జిల్లా ఒకే ఉత్పత్తి పథకానికి సంబంధించి కేంద్రం నుండి 26 అవార్డులకు గాను ఏపీకి 9 అవార్డులు దక్కాయని వాటిలో 4 అవార్డులు చేనేత రంగం సంబంధించిన రావడం గర్వకారణమన్నారు. ఎం ఎస్ ఎం ఈ పార్కులలో నేతన్నలకు ప్రత్యేక యూనిట్లు కేటా యించడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం రాకతో చేనేతల బతుకుల్లో వెలుగు లు వస్తున్నాయని తెలిపా రు. ఏడాది కాలం నుంచి నేతన్నలు తమ కాళ్ల మీద తామే నిలబడి, గౌరవ ప్రదమైన జీవనం సాగించే లా బృహత్తర కార్యక్రమాల కు ప్రభుత్వం నాంది పలి కిందన్నారు. ఒకవైపు నేతన్నలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ నదుపాయం కల్పించి వారి ఆర్థిక ఉన్నతికి వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయం తరవాత అత్యధిక మంది చేనేత రంగంపై అధారపడి జీవిస్తున్నారన్నారు.

లక్షలాది మంది చేనేత వస్త్రాల తయారీనే జీవనాధారంగా చేసుకున్నారన్నారు. మాన వుడి కనీస అవసరాలు కూడు, గూడు, గుడ్డ అని మనకు తెలుసునని, వ్యవసాయం తర్వాత అతి పెద్ద పరిశ్రమగా చేనేత హస్తకళలకు గుర్తింపు ఉందన్నారు. పుట్టిన నాటి నుండి గిట్టే వరకు మన శరీరం మీద వస్త్రాలు తప్పనిసరన్నారు. మనం ధరించే వస్త్రాలు మన మానసిక, శారీరక, ఆర్థిక, సామాజిక, వ్యక్తిత్వ గుణాల స్థాయిని రుజువు చేస్తాయ న్నారు. పంచె కట్టులో పురుషులు, చీరకట్టులో స్త్రీలు అందంగా, హుందాగా, అకర్షణీయంగా, సాంప్ర దాయం ఉట్టిపడే విధంగా కనిపిస్తారన్నారు నేతన్న చేతుల్లో మాయాజాలం ఫలితంగా సప్తవర్ణ రంగులు వస్త్రాలకు అందాల విందు లు అరబోస్తాయన్నారు . నాడు విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ చేనే త వస్త్రాలను ప్రోత్సహించ డానికి సంకేతంగా గాంధీ జీ నూలు వడికే రాట్నం ముం దు కూర్చొని ప్రచారం చేయ డం చూసామన్నారు. నాటి చేనేత వస్త్రాల నుంచి నేటి ఆధునిక సాంకేతిక యం త్రాల వినియోగం వరకు వస్త్ర పరిశ్రమ ఊహించ నంతగా అభివృద్ధి చెంద డం జరిగిందన్నారు , మంగ ళగిరి చీరలు, బెనారస్ వస్త్ర వెలుగులు, ధర్మవరం ధగ ధగలు, కోట చీరల కమ నీయాలు కలంకారీ కళాకాంతుల వస్త్ర రంగులు నేటికీ మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తూనే ఉన్నా యన్నారు .అనాదిగా గ్రామీణ ప్రజానీకానికి జీవనోపాధిని కల్పిస్తున్న దనీ ఒక దారపు పోగు భారతీయ సాంస్కృతిక వారసత్వ నంపదకు నిదర్శనంగా నిలుస్తున్నద న్నారు. దేశ సామాజిక- ఆర్థిక నుస్థిరాభివృద్ధికి చేనేత పరిశ్రమ ఊతం ఇచ్చిందన్నారు. స్వతంత్ర భారతంలో చేనేత హస్త కళలకు ప్రాధాన్యత చాలా ఎక్కువ న్నారు. నేతన్న కళ్లల్లో సంతోషం వర్షించా లంటే అయా కుటుంబాలు ఆర్థికంగా బలపడాలన్నారు. నాటి చేనేత పరిశ్రమ తక్కువ పెట్టుబడి, స్వల్ప శక్తి వినియోగం, కాలంతో పాటు వస్తున్న మార్పులకు అనుగుణంగా తమ డిజై న్లను మార్చడం లాంటివి సానుకూల అంశాలుగా చేసుకొని మార్కెట్లో డిమాండ్ ఉన్న చేనేత వస్త్రాల తయారీపై దృష్టి పెట్టి జీవనోపాదులను మెరుగు పరుచుకోవాలని స్పష్టం చేశారు మన మూలాలను వెతుక్కుంటూ, నదాచారాలను పాటిస్తూ, అరోగ్యకర చేనేత వస్త్రాలను ధరిస్తూ, నేతన్న కు బాసటగా నిలవాలన్నారు. ప్రభుత్వం ద్వారా సమకూర్చే సహాయ సహ కారాలను సకాలంలో అందిస్తూ అన్ని విధాలుగా అండగా భరోసాగా నిలు స్తామన్నారు ఈ కార్యక్ర మంలో చేనేత జౌళి ప్రాంతీయ సంచాలకులు ధనుంజయరావు ఆర్డీవో దేవరకొండ అఖిల, తాసిల్దారు బి. మృ త్యుంజయరావు
సొసైటీ సెక్రటరీలు
ఏ డి ఓ లు గుర్రాజు వెంకటేశ్వరరావు, డివో లు గంగరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలకు ఆమోదం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 24: స్థానికంగా అమలాపురం పేరూరు నందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అన్ని రకాల వసతులతో సౌకర్యవంతంగా నిర్మించ డానికి చర్యలు తీసుకుం […]

వి ఎస్ ఎం కళాశాలలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల పై ఈనెల 22 అవగాహనా సదస్సు

రామచంద్రపురం 19 డిసెంబర్ ప్రజా ఆయుధం ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం పట్టణంలో ఈనెల 22వ తేదీ, ఆదివారం ఉదయం 9 గంటలకు వి ఎస్ ఎమ్ కళాశాల మైదానంలో కార్మిక శాఖా మంత్రి […]

మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని పెంపొందించాలి: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అల్లవరం జనవరి 7: విద్యాబోధనతోపాటు ఆసక్తిగల క్రీడలలో ఉత్సాహంగా పాల్గొని , పోటీతత్వాన్ని అలవర్చుకొని జిల్లా యొక్క ఖ్యాతిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇనుమడింపచేయాలని […]

ప్రజా స్వామ్య వ్యవస్థ కోసం ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: రాజకుమారి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 27: పట్టభద్రులు అయ్యి ఓటరు గా నమోదైన ప్రతి ఒక్కరూ ఆదర్శవంత మైన ప్రజా స్వామ్య వ్యవస్థ కోసం ఓటు హక్కును […]