
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 27:

పట్టభద్రులు అయ్యి ఓటరు గా నమోదైన ప్రతి ఒక్కరూ ఆదర్శవంత మైన ప్రజా స్వామ్య వ్యవస్థ కోసం ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా తన వంతు పాత్ర పోషించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి మరియు ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి బి ఎల్ ఎన్ రాజకుమారి అన్నారు గురువారం ఎస్ కే వి ఆర్ కళాశాల నందు ఏర్పాటు చేసిన( 215,216,217) మూడు పోలింగ్ కేంద్రాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాల నందు ఏర్పాటుచేసిన (222 ,215) రెండు పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించి ఓటింగ్ నిర్వహణ తీరు ను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి పట్టపద్రుల పోలింగ్ ప్రక్రియలో సిబ్బంది అంకిత భావంతో ఎన్ని కల సంఘం మార్గదర్శకా లకు అనుగు ణంగా పని చేసి పోలింగ్ ను విజయవంతం గావించాలన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎన్ని కల పాత్ర చాలా గొప్పదని ఆరోగ్యకరమైన ప్రజాస్వా మ్యానికి స్వేచ్ఛాయుత మైన ఎన్నికలు ముఖ్యమన్నారు. ప్రజాస్వామ్యంలో తమ హక్కులు కాపాడు కోవడం పౌరులందరి బాధ్యత ఆ న్నారు. జిల్లా యంత్రాంగం స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతోoదన్నారు. పట్టభద్రుల ఓటు హక్కు ద్వారా నిజాయితీకి కార్యదక్షతకు పట్టంకట్టే ప్రజాప్రతినిధులను ఎన్నుకొని మెరుగైన ప్రజా పాలనకు బాటలు వేయాలన్నారు. భావి భారత నిర్మాణంలో ఓటర్లది నిర్ణయాత్మక పాత్ర న్నారు.

దేశ పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంతో విలువై నదన్నారు దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రపం చంలోనే మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగి ఉందని, ఎన్నికల సమయం లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాల న్నారు. ఆదర్శవంతమైన ప్రజా స్వామ్య వ్యవస్థ కోసం ప్రతి ఒక్కరూ సమాజంలో తమ వంతు పాత్ర పోషిం చాలన్నారు. ఈ కార్యక్ర మంలో తాసిల్దార్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.