
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 24:

స్థానికంగా అమలాపురం పేరూరు నందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అన్ని రకాల వసతులతో సౌకర్యవంతంగా నిర్మించ డానికి చర్యలు తీసుకుం టున్నట్లు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు.. బుధవారం ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఈ ఎస్ ఎస్ కంపెనీ ఆర్కిటెక్స్ కార్తీక్ సాయి కాంట్రాక్టర్ యాదగిరి పంచాయతీ రాజ్ డివిజన ల్ ఇంజనీర్ రాజకుమార్ లతో భవన నిర్మాణ అంశాలపై క్షుణ్ణంగా చర్చించి మ్యాపులను భవన నిర్మాణ ప్లాను డ్రాయింగ్ విధానం మ్యాపులు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలను(డి పి ఆర్) పరిశీలించి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆమోదం తెలిపారు. ప్లాన్ చాలా చక్కగా అన్ని వసతులతో రూపొందించారని అదే స్థాయిలో డిపిఆర్లు కూడా రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ 2 కోట్ల సి ఎస్ ఆర్ నిధుల తో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.