బోడసకుర్రు గ్రామం నిర్మించిన టిడ్కో గృహాలు నివాసితులకు కనీస వసతులు కల్పిస్తూ… కలెక్టర్ మహేష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -అల్లవరం ఆగస్టు 07:

స్థానిక పురపాలక సంఘ పరిధిలో గృహాలబ్ధిదారులకు బోడస కుర్రు గ్రామంలో నిర్మించిన టిడ్కో సముదాయ గృహాల లో నివాసితులకు కనీస వసతులు కల్పించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కానీ కలెక్టరేట్ నందు టిడ్కో మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి త్రాగునీరు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మురికి నీరు పారే ఏర్పాట్లు, విద్యుత్ లో వోల్టేజ్ సమస్యలను పరిష్కారం, బరియల్ గ్రౌండ్ ఏర్పాటు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు స్థానికంగా తీసుకు ని ఏర్పాట్లు సరిహద్దు గోడ నిర్మాణం ఇత్యాది అంశాలపై జిల్లా కలెక్టర్ అధ్య క్షతన సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ టి పి మురుగునీరు పైపులైన్ ద్వారా మోటార్ల సహాయం తో బయట కు పంపేందుకు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. అదేవిధంగా త్రాగునీటి కొరకు పక్కనే ఉన్న పంట కాలువ నుండి పైప్లైన్ ద్వారా ఓ హెచ్ ఎస్ ఆర్ వరకు పంపించేస్తూ స్థాని కంగా మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేసి నీటి సరఫరాకై ప్రతి పాద నలు రూపొం దించాలన్నారు. కాలువలు మూసివేత సమ యంలో బోరుబావి నుండి నీరు సరఫరా చేయాలని ఆదేశించా రు. పురపాలక సంఘం పరిధిలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్లు బోడస కుర్రు గ్రామానికి మ్యాపింగ్ చేస్తూ స్థానికంగా పింఛన్లు పొందే ఏర్పాటు చేయాల న్నారు.

వీధి లైట్లకు మున్సి పల్ కమిషనర్ మరమ్మ త్తులు చేయాలన్నారు. సరిహద్దు గోడ నిర్మించి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలన్నారు బరియల్ గ్రౌండ్ను ఏర్పాటుకు ఉపాధి అనుసంధానంతో ప్రతిపా దనలు రూపొందిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే మాధవి, మున్సిపల్ కమిషనర్ వి నిర్మల్ కుమార్, ఆర్డబ్ల్యూఎ స్ఎస్సి సి సి హెచ్ ఎన్ వి కృష్ణారెడ్డి, టిడ్కో ఎఇ మోహన్ రావు, మున్సిపల్ డి ఈ సత్యనారాయణ టి పి ఓ రాణి సంయుక్త ఏఈ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

అయినవిల్లి తహసిల్దార్ సిహెచ్. నాగలక్ష్మమ్మను పరామర్శించిన జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

భారతీయ న్యాయ స్మృతి (భారత న్యాయ సాంహిత – BNS)లోని సెక్షన్ల కింద కేసు నమోదు V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –అమలాపురం, జూన్ 6, 2025 అయినవిల్లి తహసిల్దార్ […]

V9 ప్రజా ఆయుధం దినపత్రిక/అండ దండుగా మాజీ మంత్రి & చైర్ పర్సన్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు జూలై 08: V9 ప్రజా ఆయుధం దినపత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ […]

శానపల్లిలంక పంబల కృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 24: పంబల కృష్ణ శానపల్లిలంక పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ […]

ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనంవాయవ్య దిశగా కదులుతున్న తీవ్ర అల్పపీడనంఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచనకాకినాడ, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు..ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులుభారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశంమత్స్యకారులు […]