మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని పెంపొందించాలి: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అల్లవరం జనవరి 7:

విద్యాబోధనతోపాటు ఆసక్తిగల క్రీడలలో ఉత్సాహంగా పాల్గొని , పోటీతత్వాన్ని అలవర్చుకొని జిల్లా యొక్క ఖ్యాతిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇనుమడింపచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ విద్యార్థినీ విద్యార్థులకు పిలుపునిచ్చారు.


మంగళవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం
మండల పరిధిలోని కొమరగిరిపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు కోనసీమ క్రీడ ఉత్సవాల పోటీలను ప్రారంభించి క్రీడా కార్యక్రమాల నిర్వహణ తీరును పర్యవేక్షించారు.


ఈ సందర్భంగా ఆయన ఈ క్రీడా పోటీ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని క్రీడా ప్రతిభను, క్రీడా స్ఫూర్తిని చాటుతూ కోనసీమ జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు గడింప చేయాలన్నారు. విద్యార్థిని మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని కనబరిచేందుకు ఈ కోనసీమ క్రీడోత్సవాలు ఆటలతో ఆరోగ్యం కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. తద్వారా ఆరోగ్యం, మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చునని ఆయన సూచించారు. అథ్లెటిక్స్ బ్యాట్మెంటన్, క్రికెట్,కబడ్డీ,కోకో, వాలీబాల్ వంటి పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మండల స్థాయిలో 4, 5, 6 తరగతుల విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు మెడల్సు ప్రశంసా పత్రాలు అందించడం జరుగుతుందన్నారు 7, 8, 9 తరగతుల విద్యార్థిని విద్యార్థుల మండల స్థాయిలో గెలుపొందిన వారు జిల్లాస్థాయి పోటీలలో పాల్గొంటారని జిల్లా స్థాయిలో నిలిచిన విజేతలకు మెడల్స్ ప్రశంసా పత్రాలను బహుకరించడం జరుగుతుందన్నారు.


ప్రస్తుత యాంత్రిక జీవన విధానంలో క్రీడల అభ్యసన చాలా అవసరమని, పాఠశాల విద్యార్థులు అభిరుచికి అనువైన క్రీడల్లో తగిన ప్రోత్సాహక శిక్షణ ఇవ్వడం ద్వారా ముందంజలో నిలిచే అవకాశాలు నిండుగా ఉంటాయన్నారు.
ప్రతి విద్యార్ధి విద్యతో పాటు ఏదో ఒక క్రీడలో నైపుణ్యం సాధించాలని, క్రీడలతో ఆరోగ్యమే కాకుండా మానసిక ఆనందం సొంతం అవు తుందన్నారు క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుందన్నారు క్రీడలను కేవలం గెలుపు,ఓటములకే పరిమితం చేయొద్దని, శారీరక, మానసిక ఉల్లాసం, ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశంగా ఆటలను గుర్తించాలన్నారు చదువుల్లో రాణిం చాలంటే ఎంత శ్రద్ధ అవసరమో, అంతకంటే ఎక్కువ శ్రద్య క్రమశిక్షణ క్రీడల్లో రాణించడానికి అవసరమని స్పష్టం చేశారు. ప్రస్తుత పోటీ, బిజీతో కూడిన ఆధునిక ప్రపంచంలో క్రీడల ద్వారా వచ్చే శారీరక ఆరోగ్యం మూలంగా దీర్ఘకాలిక జబ్బులు సంక్రమించ వన్నారు.గెలుపోటములకే క్రీడలను పరిమితం చేయకుండా క్రీడాకా రులను ప్రోత్సహిస్తూ అథ్లెటిక్ పోటీలను ఎంతో క్రమశిక్షణతో నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు క్రీడా పోటీల నిర్వహణపై పలు సూచనలు చేశారు పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆటల ద్వారా ఆరోగ్యం అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు ఆటలు, ఆరోగ్యం ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరికి వివరించాలని సూచించారు.ఆరోగ్యంగా ఉన్న సమాజమే, అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు పి ఎస్ సురేష్ కుమార్ ఎంపీడీవో కృష్ణమోహన్, స్థానిక ప్రజాప్రతినిధులు విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

డిసి అధ్యక్షుడు శ్రీనివాస్ ను అభినందించిన టిడిపి లీగల్ సెల్ భాస్కర్ జోగేష్.

డిసి అధ్యక్షుడు శ్రీనివాస్ ను అభినందించిన టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు బడుగు భాస్కర్ జోగేష్. అయినవిల్లి సాగునీటి వినియోగదారులు సంఘ(డి.సి) అధ్యక్షుడిగా ఎన్నికైన కాకర శ్రీనివాసరావుకు టిడిపి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు […]

కోరంగి PA CS కమిటీ ప్రమాణ స్వీకారానికి ఎంపీ హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -తాళ్లరేవు సెప్టెంబర్ 16: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో ప్రాథమిక […]

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ గా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జూలై 14: ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు: జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. […]

వాటర్ ట్యాంకు. ప్రారంభించిన అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జనవరి 11: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోడూరుపాడు గ్రామంలో 32 లక్షలు రూపాయలు నిధులతో నిర్మించిన వాటర్ […]