స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక -అమలాపురం డిసెంబర్ 13: రాష్ట్ర దశ దిశ మార్చే దిశగా ఒక కొత్త చరిత్రకు నాంది పలుకుతూ స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ను శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు ఆవిష్కరించారు. ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కోనసీమ జిల్లాలో పలువురు అధికారులు వీక్షించారు. భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా రూపకల్పన చేసేందుకు ప్రధానమంత్రి వికసిత్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంటును సుసంపన్న, ఆరోగ్యకర, సంతోషకరమైన స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా పది సూత్రాలతో రూపొందించడం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 లక్షల మంది విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగస్వాములై స్పందన, సలహాలు, సూచనలు అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేశారని వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని అత్యంత ప్రతిష్టాత్మకంగా డాక్యుమెంట్లును మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రూపొందించారన్నారు. స్వర్ణాంధ్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను వినూత్న ఆవిష్కరణలతో ప్రోత్సహిస్తూ ఉద్యోగాల కల్పన చేపట్టాలన్నారు. నదులు అనుసంధానం, నీటి సంరక్షణ, వర్షపు నీటిని ఇంకుడు గుంటల ద్వారా భూమిలో ఇంకింప చేసే విధానాలతో సమృద్ధిగా త్రాగునీరు, సాగునీరును సరఫరా చేస్తూ రాష్ట్రం సస్యశ్యామలం పచ్చదనంతో శోబిల్లుతూ సుభిక్షంగా ఉండేలా పటిష్టమైన ప్రణాళికలను రూపొందించడం జరిగిందన్నారు. సంపదను సృష్టిస్తూ విప్లవాత్మకమైన మార్పులు దిశగా స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా అంకుటిత దీక్షతో ముందుకు సాగు తున్నామన్నారు. భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ప్రగతి పథ సంకల్పానికి ప్రతీకగా ఈ విజన్ డాక్యుమెంట్ ను తీర్చిదిద్దామన్నారు. పర్యావరణ పరిరక్షణ, జీవవైవిద్యo సమతుల్యత, వాయు కాలుష్యం నియంత్రణ, సౌర విద్యుత్ వాడకం, ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెంపుదల అంశాలకు ఈ విజన్ డాక్యుమెంట్ లో ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్తు తరాలకు ఆయా వనరులు అందించే దిశగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఆక్వారంగ ఉత్పత్తులు ప్రస్తుతం 41 శాతమే ఉన్నాయని ఈ ఉత్పత్తులను 50 శాతానికి పెంచే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అన్ని రకాలుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రజానీకం సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలను రచించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న తలసరి ఆదాయాన్ని 2047 నాటికి 40 రేట్లు పెంచాలని ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి పాలనలో సమూలమైన మార్పులు తేవడం జరుగుతుందన్నారు. విజన్ 2020 లో ఐటీ రంగం సత్ఫలితాలను ఇచ్చిందని నేడు తెలుగు యువత ఆ యొక్క లబ్ధిని పొందుతున్నారన్నారు. పేదరిక నిర్మూలన ఉపాధి కల్పన నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత వ్యవసాయ సాంకేతికత ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ శక్తి ఇంధనాల వ్యయ నియంత్రణ అన్ని రంగాలలో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛంద, అన్ని దశలలో సమగ్ర సాంకేతికత అను 10 సూత్రాల ఆధారంగా డాక్యుమెంట్ ను రూపొందించడం జరిగిందన్నారు. చివరిగా స్వర్ణాంధ్ర@ 2047 ప్రతిజ్ఞను చేయించారు.

Related Articles

ముమ్మిడివరం లో ముంపు బారిన పడిన దృష్ట్యా C I, MRO,ఉప ఖజానాను సందర్శించిన కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ప్రజాముమ్మిడివరం ఆగస్టు 14: భారీ వర్షాల నేపథ్యంలో పల్లపు ప్రాంతాలలో ఉన్న కార్యాలయాల రికార్డుల భద్రతపై పటిష్టమైన చర్యలు చేపట్టాలని డాక్టర్ బి ఆర్ […]

క్రిస్మస్‌ వాటికన్ సిటీ నుంచి పోప్‌ సందేశం

క్రిస్మస్‌ సందర్భంగా వాటికన్ పోప్‌ సందేశం ఆయుధాలను పక్కన పెట్టాలి. బుధవారం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 25, 2024న వాటికన్ సిటీ నుంచి పోప్ ఫ్రాన్సిస్ క్రిస్మస్ సందేశం ఇచ్చారు. ఉక్రెయిన్, ఆఫ్రికా […]

యానం బీచ్ లో రెండో రోజు వాలీబాల్ బాల్ పోటీలు తిలకించాలి: ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -డిసెంబర్ 28:డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఎస్. యానాం బీచ్ శుక్రవారం నుంచి జాతీయ మహిళల బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. బీచ్ […]

అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు బీచ్, సినీ నటి హెబ్బా పటేల్ రాక

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాం బీచ్ లో అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరగనున్నాయి.ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరోయిన్ […]