ముమ్మిడివరం లో ముంపు బారిన పడిన దృష్ట్యా C I, MRO,ఉప ఖజానాను సందర్శించిన కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ప్రజాముమ్మిడివరం ఆగస్టు 14:

భారీ వర్షాల నేపథ్యంలో పల్లపు ప్రాంతాలలో ఉన్న కార్యాలయాల రికార్డుల భద్రతపై పటిష్టమైన చర్యలు చేపట్టాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఇన్చార్జి డిఆర్ఓ కొత్త మాధవితో కలిసి ముమ్మిడివరంలోని బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు కార్యాలయాలు ముంపు బారిన పడిన దృష్ట్యా పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, తాసిల్దార్ కార్యాలయం, ఉప ఖజానా అధికారి వారి కార్యాలయాలను సందర్శించి భద్రపరిచిన రికార్డు లు రికార్డు రూములను కంప్యూటర్లు భద్రతను పరిశీలించారు.

ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడు తూ బుధవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షా లు నమోదైన నేపథ్యం లో స్థానికంగా పల్లపు ప్రాంతా లలో ఉన్న ఈ మూడు కార్యాలయాలు రికార్డులు ఏ విధంగా ఉన్నది పరిశీలిం చడం జరిగిందన్నారు. అన్ని రికార్డులు భద్రంగా ఉన్నాయని ముంపు దృష్ట్యా రికార్డు రూములు కూడా భద్రతపై మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మూడు కార్యాలయాలలో రికార్డుల భద్రతకు శాశ్వత ప్రాతిప దికన చర్యలు తీసుకునేం దుకు అవసరమైన నివేదిక లను రూపొందించాలని ఇన్చార్జి డిఆర్ఓ కే మాధ విని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి టి ఆచార్య తాసిల్దార్ సుభాష్ రెవెన్యూ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

కమ్యూనిస్టు నాయకుడు మచ్చా నాగయ్య మృతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 29: మచ్చా నాగయ్య మృతి కి పలువురు సంతాపం తెలిపారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలానికి […]

D B R అంబెడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రెట్ కు 210 అర్జీలు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 23: ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తు న్న ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమ ఆర్జీలు పట్ల తూ తూ […]

10 వ తరగతి నుండి పీజీ వరకు జాబ్ మేళా గ్రేస్ డిగ్రీ కళాశాల పి.గన్నవరం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 24: నిరుద్యోగులకు, ఉద్యోగా ర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు ఒకే వేదికపైకి వచ్చి నిర్వ హించే ఉద్యోగ నియామక […]

అల్లు అర్జున్ కు జూనియర్ ఎన్టీఆర్& ప్రభాస్ కాల్

సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్టై బెయిల్ పై విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఫోన్లో పరమర్శించారు. అరెస్ట్ […]