రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ అన్నదాతలతో కలిసి కలెక్టరేట్‌కి ర్యాలీగా వైయస్‌ఆర్‌సీపీ నేతలు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక – అమలాపురం డిసెంబర్ 13
అన్న దాతకు అండగా…ర్యాలీలో పాల్గొన్న జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ మంత్రి లు, పినీపే విశ్వరూప్, గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు,బొమ్మి ఇశ్రాయేలు,
కుడిపూడి సూర్య నారాయణ, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ,పోన్నాడ సతీష్ కుమార్, పాముల రాజేశ్వరి, మాజీ ఎంపీ చింత అనురాధ, నియోజకవర్గం ఇంచార్జ్ లు విప్పార్తి వేణుగోపాల్, పిల్లి సూర్య ప్రకాష్, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒంటెద్దు వెంకయ్య నాయుడు,చెల్లుబోయిన శ్రీనివాసరావు,కుంచే రమణారావు,
ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కాశీ ముని కుమారి, దేవరపల్లి గీతా, జడ్పిటిసి సభ్యులు గెడ్డం సంపత్ రావు, గన్నవరపు శ్రీనివాసరావు,పందిరి శ్రీహరి,కోనుకు బాపూజీ,మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ శాఖల నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు,మాజీ ఎంపీ,మాజీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇచ్చే సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటే అమలు చేయలేదని అన్నం పెట్టే రైతాంగాన్ని ఆదుకోవడంలో విఫలమైందని, ఇచ్చిన హామీల్లో భాగంగా రైతులు ఖాతాల్లో జమ చేస్తానని అన్న 20,000 రూపాయలు జమ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ తో కాలం వెళ్లబోస్తుందని ఆరోపించారు. అదేవిధంగా సూపర్ సిక్స్ లు భాగంగా చదువుకునే విద్యార్థులకు ఇచ్చిన తల్లికి వందనం హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చిన నవరత్నాలు లో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి గా అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రైతులు ఖాతాల్లో పది ఐదు వేల రూపాయలు జమ చేయడం జరిగిందని అన్నారు, కానీ నేడు వచ్చిన కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోకుండా, ఇచ్చిన హామీల ఏ ఒక్కడి అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ తో పక్క పార్టీపై నెట్టు వేస్తూ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. తక్షణమే ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ ఇంచార్జ్ అధికారికి వినతిపత్రం అందజేశారు.