విద్యార్థిని విద్యా ర్థుల్లో అభ్యసన సామ ర్ధ్యాల స్థాయి తెలుసు కోవాలి
December 14, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

*విద్యార్థిని విద్యా ర్థుల్లో అభ్యసన సామ ర్ధ్యాల* *స్థాయి తెలుసు కోవాలి*
విద్యార్థిని విద్యా ర్థుల్లో అభ్యసన సామ ర్ధ్యాల స్థాయిని తెలుసు కునేందుకు నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే ( నాస్) విజయవంతం చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ,జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష పిలుపునిచ్చారు. నాస్ సర్వే నిర్వహించేందుకు నియమిం చిన విద్యార్థులకు పునఃశ్చరణ ఓరియంటేషన్ తరగతులు విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు శుక్రవారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా షేక్ సలీం భాష ఫీల్డ్ ఇన్వెస్టిగేట ర్లను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ సర్వే ద్వారా విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు ఏ మేరకు ఉన్నాయో తెలు సుకునే వీలౌతుందన్నారు ఈ సర్వే ను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు సమర్థవంతంగా నిర్వహించా లన్నారు సర్వేలు పకడ్బందీగా నిర్వహించేందుకు థర్డ్ పార్టీగా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లను నియ మించడం జరిగిందన్నారు. డీసీఈబి సెక్రెటరీ బి హను మంత రావు, సమగ్ర శిక్ష ఏఎంఓ పి.రాంబాబు మాట్లాడుతూ నాస్ సర్వేలో భాగంగా జిల్లాలో ఉన్న ఎంపిక చేసిన 104 పాఠశాలల్లోని 3, 6, 9 తరగతుల విద్యార్థులకు డిసెంబర్ 4వ తేదీన పరీక్ష నిర్వహించడం జరుగుతుం దన్నారు. ప్రభుత్వ పబ్లిక్ పరీక్షలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ పరీక్షలు నిర్వహి స్తున్నామన్నారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చురుగ్గా చేపడుతున్నట్లు తెలి పారు. అధికారులు విద్యా ర్థులతో సమన్వయం చేసుకుని నాస్ పరీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డిస్టిక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ సురేష్ జాన్ బాబులు నాస్ సర్వే ఏ విధంగా చేయాలన్న దానిపై ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు శిక్షణ ఇచ్చారు.
ఐటెం నెంబర్ 2: కొంకాపల్లి జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని భారత రాజ్యాంగ విశిష్టత అనే అంశంపై ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థుల కు వ్యాసరచన క్విజ్జు వక్తృత్వపు పోటీలు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి సూచనలకు అనుగుణంగా నిర్వహించి నట్లు ఉప విద్యాశాఖ అధికారి జి సూర్య ప్రకాశం తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులు జోనల్ స్థాయిలో పోటీలలో పాల్గొం టారని ఆ యొక్క జోనల్ స్థాయిలో గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేస్తారని ఉప విద్యాశాఖ అధికారి తెలిపారు.ఈ సమావేశంలో అమలాపురం డివిజన్ పరిధిలోని మండల విద్యా శాఖ అధికారులు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు పాల్గొన్నారు.
Related Articles
రాజకీయాలకు వన్నెతెచ్చిన రాజ నీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజపేయి
శత జయంతి వేడుకలో మంత్రి వాసంశెట్టి సుభాష్. V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు రామచంద్రపురం,డిసెంబర్ 25: దేశంలో రాజకీయాలకి వన్నె తెచ్చిన రాజ నీతిజ్ఞుడు, భారతదేశ పూర్వ ప్రధాని, భారతరత్న […]
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వై.ఎస్.ఆర్. కడప క్రీడా పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరం 4 వ తరగతి 5 వ తరగతి లో ప్రవేశము కొరకు ధరఖాస్తులు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 03: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారు వై.ఎస్.ఆర్. […]
గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటల నుండి ప్రారంభం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 23 ఆంధ్రప్రదేశ్ గురుకులపాఠ శాలలో2025- 26 విద్యా సంవత్సరం 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25వ తేదీ […]
సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతుల వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలు పై కలెక్టర్ ఆరా!
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 31: అత్యంత ప్రతిష్టాత్మ కంగా జిల్లాలోని సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతుల వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలో అన్ని వసతులు మౌలిక […]