
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 31:

అత్యంత ప్రతిష్టాత్మ కంగా జిల్లాలోని సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతుల వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలో అన్ని వసతులు మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉండేలా నవీనీకరణకు చేపట్టిన సర్వే ప్రతిపా దనలు కాంపోనెంట్ వారిగా విద్యార్థినీ విద్యార్థుల దామాషా ప్రాతిపదికన రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఇంజనీర్లను సంక్షేమ అధికారులను ఆదేశించారు. ఇటీవల డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా వ్యాప్తంగా ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు సంక్షేమ వసతి గృహ అధికారులతో చేపట్టిన సర్వే నివేదికలు లోపభూయిష్టంగా ఉండి స్పష్టత కొరబడిందని వీటిని మరల పునః పరిశీలించి కాంపోనెంట్లు వారీగా క్లాసులు విద్యార్థుల దామాషా ప్రాతిపదికన పూర్తి స్పష్టతతో చెక్ లిస్ట్ ప్రకారం స్టాండర్డ్స్ రేట్లు ప్రకారం అంచనాలు రూపొందించి ఒక వారంలో సమర్పించాలని ఆదేశించారు.

ఈ నివేదికలు అందిన పిదప వాటిలో కొన్నింటి అంచనాలను యాదృచ్ఛికంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి తదుపరి కార్యాచరణను రూపొందిస్తూ టెండర్లు పిలిచి ఆయా పనులను పూర్తి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. విద్యార్థినీ విద్యార్థుల అవసరాలు వసతులను తీర్చే దిశగా ప్రతిపాదనలు అన్నింటినీ క్రోడీకరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సంక్షేమశాఖ డివిజనల్ ఇంజనీర్ సుబ్బరాజు ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి ఇంజనీర్లు వివిధ వసతి గృహాల సంక్షేమ అధికారులు రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్ లు తదితరులు పాల్గొన్నారు.