
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 03:

జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారు వై.ఎస్.ఆర్. కడప క్రీడా పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరం నిమిత్తము 4 వ తరగతి మరియు 5 వ తరగతి లో ప్రవేశము కొరకు ధరఖాస్తులు ఆహ్వానించడమైనది.
మొత్తం ఖాళీలు:
4వ తరగతిలో గల ఖాళీలు
(బాలికలు20+బాలురు20)
మొత్తం: 40
5వ తరగతిలో గల ఖాళీలు
(బాలికలు20+బాలురు20) మొత్తం: 40
4 వ తరగతి కొరకు అర్హతలు:
- 01.04.2015 నుండి 31.03.2017 మద్యలో జన్మించిన వారు అయి ఉండాలి.
- 1వ తరగతి నుండి 4వ తరగతి వరకు ప్రభుత్వ /ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యా సంవత్సరము తప్పని సరిగా పాసై ఉన్న వాళ్ళని మాత్రమే 4వ తరగతి లోనికి పంపబడతారు,
- Act 1969 ప్రకారం తప్పనిసరిగా సదరు పంచాయతి/మున్సిపల్/కార్పోరేషన్ ద్వారా గాని ఏదైనా సూచించిన ఇతర సంస్థ ద్వారా గాని జారీ చేసిన పుట్టిన తేది దృవ పత్రము మరియు అసలు పుట్టిన తేది నుండి సంవత్సరము లోపు అయి ఉన్న పుట్టిన తేది దృవ పత్రము మాత్రమే ఈ ఎంపికలకు/అడ్మిషన్లకు అర్హత కలదు.
05 వ తరగతి కొరకు అర్హతలు: - 01.04.2014 నుండి 31.03.2016 మద్యలో జన్మించిన వారు అయి ఉండాలి.
- 1వ తరగతి నుండి 4వ తరగతి వరకు ప్రభుత్వ /ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యా సంవత్సరము తప్పని సరిగా పాసై ఉన్న వాళ్ళని మాత్రమే 5 తరగతి లోనికి పంపబడతారు,
- Act 1969 ప్రకారం తప్పనిసరిగా పంచాయతి/మున్సిపల్/కార్పోరేషన్ ద్వారా గాని ఏదైనా సూచించిన ఇతర సంస్థ ద్వారా గాని జారీ చేసిన పుట్టిన తేది దృవ పత్రము మరియు అసలు పుట్టిన తేది నుండి సంవత్సరము లోపు అయి ఉన్న పుట్టిన తేది దృవ పత్రము మాత్రమే ఈ ఎంపికలకు/అడ్మిషన్లకు అర్హత కలదు.
పై తెలిపిన అర్హతలు గల క్రీడాకారులు ముందుగా సూచించిన వెబ్ సైట్: https://apsportsschoo.ap.gov.in/. ద్వారా పేర్లు నమోదు చేసుకొనుటకు ఆఖరు తేది 19.06.2025.
తదుపరి 20.06.2025 నుండి 25.06.2025 వరకు ఆన్ లైన్ లో సమర్పించిన అప్లికేషన్స్ స్క్రీనింగ్ మరియు షార్ట్ లిస్ట్ చేసిన పిదప విడుదల చేసిన జాబితా ప్రకారము ది.01.07.2025 నుండి 03.07.2025 వరకు ఆయా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల ఆధ్వర్యములో నిర్వహించు జిల్లా స్థాయి ఎంపికలకు అన్ని ఒరిజనల్ పత్రములతో హాజరు కావలసి యుండును.
పై తెలిపిన జిల్లా స్థాయిలో జరిగిన ఎంపికలలో అర్హత పొందిన వారిని తదుపరి 10.07.2025 & 11.07.2025 తేదిలలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సూచించు క్రీడా ప్రాంగనుములో రాష్ట్ర స్థాయి ఎంపికలకు హాజరు కాబడతారు.
పై సమాచారము డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా మొత్తము ప్రచురణ చేయవలసినదిగా కోరడమైనది. మరిన్ని వివరములకు సంప్రదించ వలసిన నెం. : 7993329433(పి.ఎస్.సురేష్ కుమార్) జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ,
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం