V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 23
ఆంధ్రప్రదేశ్ గురుకులపాఠ శాలలో2025- 26 విద్యా సంవత్సరం 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను మాత్రం మే 14వ తేదీన విడుదల చేస్తారన్నారు. అదేవిధంగా ఏప్రిల్ 25 మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5 గంటల వరకు జూనియర్ ఇంటర్ లో 2025- 26 విద్యా సం వత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కాలేజీల్లో పలు కోర్సుల్లో ప్రవేశ పరీక్ష సైతం ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్నారన్నారు. ఈ పరీక్షలు నిర్వహణకు గాను కోన సీమ జిల్లావ్యాప్తంగా రెండు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసినట్లు తెలి పారు. ఈ ప్రవేశ పరీక్షల నిర్వహణ కొరకు ఈనెల 25 వ తేదీన జిల్లా కేంద్రమైన అమలాపురంలోని 2 పరీక్షా కేంద్రాలలో శాంతియుతంగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించడం కోసం వివిధ శాఖాధిపతులకు విధులు బాధ్యతలు కేటాయించడం జరిగిందన్నారు స్థానిక బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అమలాపురం నందు ఏపీఆర్ఎస్ ఐదో తరగతిలో ప్రవేశం పరీక్ష ఉదయం 10:00 నుండి 12 మధ్యా హ్నం నిర్వహిస్తారని ఏపీఆర్జేసీ జూనియర్ ఇంటర్లో ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2:30 నుండి 5:00 వరకు ఎం జి మున్సిపల్ హై స్కూల్ వి అగ్రహారం నందు నిర్వహిస్తారన్నారు
ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ సిబ్బందిని నియమించామని నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కొన సాగేందుకు చర్యలు గైకొనడం జరిగిందన్నారుపరీక్షా సమయాలలో పరీక్షా కేంద్రాలలో చుట్టుపక్కల జిరాక్స్ కేంద్రాలను మూసివేయడం జరుగు తుందనిపరీక్షా కేంద్రాలు పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం చేయడం జరిగిందన్నారు
రెండు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీటి సౌకర్యాలను అందించడం జరుగు తుందని,సిసి టివి పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించడం జరుగు ఉందని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.