విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు: జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి

V9 prajaayudham
V9 ప్రజా ఆయుధం దినపత్రిక -డిసెంబర్ 2024:విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు అని విద్యుత్ పొదుపుగా వాడి ఆధాచేస్తూ భావితరాలకు ఇంధన వనరులపై భరోసాను కల్పించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాoతి ప్రజలకు పిలుపు నిచ్చారు.శనివారం స్థానిక కలెక్ట రేట్ నుండి గడియారపు స్తంభం వరకు నిర్వహించి న ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని జాయింట్ కలెక్టర్ కలెక్టరేట్ నందు జండా ఊపి ప్రారంభించగా ట్రాన్స్కో సిబ్బంది ఇంధనాన్ని ప్రతి ఒక్కరూ పొదుపు చేయాలనే నినాదాలతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే భావితరాలకు సహజ వన రులను అందించేందుకు ప్రతి ఒక్కరు సమిష్టిగా ఇంధన పొదుపును ఆచరించాలని స్పష్టం చేశారు.నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపు పట్ల అవ గాహన ఎంతైనా అవసరమని తెలిపారు. ఇంధన సంరక్షణ సామర్ధ్యాలు, ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు ఈ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు ప్రతి ఏడాది ఇంధన పొదుపుకై వివిధ అంశాల పై కార్యక్రమా లు నిర్వహించనున్నట్లు తెలి పారు. ఇంధన వాడకం నిత్య కృత్యంగా వాహనాలు నడవ డానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడా నికి ఇలా ఇంధనం ఎన్నో రకాలుగా ఉపయోగపడు తున్నదన్నారు. మూడు నక్షత్రాలు నుండి ఐదు నక్షత్రాలు రేటింగ్ కలిగిన విద్యుత్ గృహపకరణాలు వినియోగించడం ద్వారా 30 శాతం విద్యుత్తును ఆదా చే యవచ్చునని ఆమె తెలిపా రు. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించ డానికి డిసెంబర్ 14న ప్రతి ఏడాది జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవంగా నిర్వహిస్తారన్నారు. భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంధన పొదుపు చట్టాన్ని తీసుకురావడమే కాకుండా, ప్రతి సంవత్సరం జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నద న్నారు. మనం ప్రతిక్షణం ఎన్నోరకాల ఇంధనాలపై ఆధారపడి జీవిస్తున్నామని. అను నిత్యం గృహోపకరణా లు అయిన లైటు, ఫ్యాను, టీవీ, సెల్ఫోన్, మిక్సీ, గ్రైం డర్, పొయ్యి మొదలు రైలు, బస్సు, విమానం, రాకెట్ ఇలా ప్రతీది ఇంధనంపై ఆధారపడే నడుస్తోందన్నారు నీరు, పెట్రోల్, డీజిల్, బొగ్గు, విద్యుత్, కట్టెపుల్లలు సహా ఎన్నో రకాల ఘన, ద్రవ, వాయు ఇంధనాలు, యురేని యం, వంటి అణు రసాయన ఇంధనాలు నిత్య జీవితంతో పెన వేసుకున్నాయన్నారు. ఇంధన వృథాను అరికట్ట డంపై అవగాహన పెంపొం దించడం ఇంధన పొదుపు దినోత్సవ ప్రధాన లక్ష్యం అన్నారు. ఇష్టారాజ్యంగా, ఇబ్బడి ముబ్బడిగా ఇంధన వనరుల వినియోగం భవి ష్యత్ అవసరాలను ప్రశ్నార్థ కంగా మారుస్తున్నదని. ఈ నేపథ్యంలో ఇంధన వనరుల రక్షణ అనివార్యంగా ప్రతి ఒ క్కరి బాధ్యతగా మారిందని. అవసరాలకు మించి వినియో గం చేస్తూ, పొదుపుపై అదుపు లేకుంటే భవిష్యత్తు అంధకా రమేనన్నారు. అందుకే సంప్ర దాయేతర ఇంధన వినియో గం ప్రత్యామ్నాయ మార్గంగా చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇంధనం లేకుండా ఒక్క క్షణం కూడా గడవదంటే అతిశయోక్తి కాదన్నారు. ట్రాన్స్కో ఎస్ ఇ .ఎస్ రాజబాబు ప్రసంగిస్తూ ఇబ్బడి ముబ్బడి ఇంధన వనరుల వినియోగం భవిష్య అవసరాలను ప్రశ్నార్థకం చేస్తోందని,ఈనేపథ్యంలో ఇంధన వనరుల రక్షణ ప్రతిఒక్కరి బాధ్యతగా మారిందన్నారు. జనాభా పెరుగుదలతో పాటే పెట్రోలు, డీజిల్, గ్యాసు, విద్యుత్ వంటి ఇంధన వనరుల వినియోగం విపరీతంగా పెరుగుతోందన్నారు. ఒక రకంగా ఆర్ధిక పరిస్థితులను ప్రభావితం చేసే పారిశ్రామిక రంగ ప్రగతిని నిర్దేశించే వే ఇంధన వనరులన్నారు. అందుకే అభివృద్ధి చెందు తున్న దేశంగా మన దేశంలో ఇంధన వనరుల వినియోగం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిందన్నారు. ఫలితంగా సంప్రదాయ ఇంధన వనరులు హరించుకు పోతున్నాయని, ఇలాంటి ఇంధన వనరులను రక్షించుకోవడమే నేడు ప్రధాన కర్తవ్యంగా మారిందన్నారు. సంప్రదాయ ఇంధన వనరు లైన బొగ్గు, పెట్రోల్, డీజిల్, అణు ఇంధనాలు ప్రకృతిలో పరిమితంగా మాత్రమే లభి స్తాయని, వాటిని ప్రస్తుతం వినియోగిస్తున్నట్లుగా విప రీతంగా వినియోగిస్తే ప్రమా దం తప్పదని ప్రస్తుతం మనం చేస్తున్న వృథా భవిష్యత్తు తరాలకు అంధకారాన్ని మిగులుస్తుందన్నారు. అందుకోసం సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర, పవన, విద్యుత్ వనరులపై ఆధారపడాలని. పెట్రోల్ డీజిల్ గ్యాసులకు బదులుగా బయో ఇంధన వనరులను, బ యోడీజిల్, బయోగ్యాస్ వంటి ఇంధన వనరులపై ఆధారపడడం వల్ల భవి ష్యత్తు తరాలకు మేలు చేసిన వారమవుతామన్నారు. ఇంధ న పేదరికాన్ని అంతంచేసే దిశగా పునరుత్పాదక ఇంధన వనరులు, స్వచ్ఛమైన శిలాజ ఇంధనాలను, పర్యావరణ హితమైన ఇంధనాలను తగిన పరిమాణంలో అందుబాటు లో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిజిలు రవికుమార్ పుల్లయ్య ఏఈ రవి కుమార్ ట్రాన్స్కో సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

పచ్చిమాల వివాహ వేడుకల్లో గన్నవరపు సందడి.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఫిబ్రవరి 14: పశ్చిమాల సుబ్బారావు కుమార్తె వివాహ వేడుకల్లో గన్నవరపు శ్రీనివాసరావు సందడి చేశారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారుల సముద్రపు వేటకు అడ్డులేదు: కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 26: మత్స్యకారుల సమస్యలపై మత్స్యకార ప్రతినిధులు మత్స్య శాఖల అధికారుల తో కూలంకశంగా పూర్తిగా చర్చించి మరో 10 రోజుల్లో అందరికీ […]

అంబేద్కర్ మహనీయులకు క్షమాపణ చెప్పాలి; షర్మిల రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో కులం,మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. శనివారం ఏపీసీసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘దేశం […]

వన మహోత్సవం/పర్యావరణ సమతుల్యతను కాపాడాలి: అమలాపురం ఆర్డీవో మాధవి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 05: పర్యావరణ సమతుల్యతను జీవవైవిద్యాన్ని కాపాడటానికి నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమం వన మహోత్సవ కార్యక్ర మమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి […]