
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 21:

మాజీ మండల ప్రజా పరిషత్ విప్ వేటుకూరి రమేష్ రాజు గారికి ప్రజా ఆయుధం ఎడిటర్ వినయ్ కృతజ్ఞతలు తెలిపారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాగం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మండల ప్రజా పరిషత్ మాజీ విప్ వేటుకూరి రమేష్ రాజు ను V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పి.గన్నవరం నియోజకవర్గం లో ప్రజా ఆయుధం దినపత్రిక (న్యూస్ పేపర్) ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో ముమ్మిడివరం నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న ప్రింటింగ్ ముద్రణ యంత్రం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. వేటుకూరి సానుకూలంగా స్పందిస్తూ… ప్రతి అక్షరం ప్రజా పక్షంగా ఉండేవిధంగా ప్రజా ఆయుధం జర్నలిజం అటువైపు ఉండాలని సూచించారు. అదేవిధంగా ప్రజా ఆయుధానికి అండగా ఉంటానని మాటిచ్చారు. వినయ్ కుమార్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.