ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలు డిఆర్ఓ ఆకస్మికంగా తనిఖీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 4:

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా రెవెన్యూ అధికారి బి ఎల్ ఎన్ రాజకుమారి.

ఇంటర్ బోర్డు వార్షిక పబ్లిక్ పరీక్షలు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా రెవెన్యూ అధికారి బిఎల్ఎన్ రాజకుమారి పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ పబ్లిక్ బోర్డు వార్షిక పరీక్షలు ప్రారంభ మైన నేపథ్యంలో స్థానిక శ్రీ చైతన్య నారాయణ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో విద్యా ర్థులు పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లు సౌకర్యా లను పరిశీలించారు. పరీక్షకు హాజరు కాని వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేసవి నేపథ్యంలో తాగు నీటికి ఇబ్బంది లేకుండా తీసుకున్న చర్యలతో పాటు వైద్య శిబిరాన్ని పరిశీలిం చారు. ఓఆర్ఎస్ ప్యాకెట్ల తోపాటు అత్యవ సర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు భద్రతా ఏర్పాట్లను ఆమె పరిశీలించి తగు సూచన లు చేశారు సిట్టింగ్ స్వాడ్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకొని. చీఫ్ సూపరింటెండెంట్ తో సహా ఇన్విజిలేటర్లు, పరీక్షా విధులకు కేటాయించిన ప్రతిఒక్కరినీ క్షుణ్నంగా తనిఖీచేసి మాత్రమే లోపలికి అనుమతిం చాలన్నారు. అత్యవసర కమ్యూనికేషన్ నిమిత్తం చీప్ సూపరింటెం డెంట్ వారికి మాత్రమే కీప్యా డ్ చరవాణి అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు గదు ల్లో గాలి, వెలుతురు బాగా ఉండేలా చూసు కోవాలని. ఏమాత్రం విద్యార్థులు అసౌకర్యా నికి గురికాకుండా చూడా లన్నారు. ఇంటర్మీడియెట్ విద్య పాఠశాల విద్య, రెవెన్యూ, పోలీస్, ప్రజా రవాణా, వైద్య ఆరోగ్యం, విద్యుత్, పోస్టల్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా జరిగే లా చూడాలన్నారు. ఈ నెల ఒకటో తేదీన ప్రారంభమైన ఇంటర్ థియరీ పరీక్షలు మార్చి 20వ తేదీ వరకు 40 కేంద్రాల్లో 27,312 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరవుతున్నారన్నారు పరీక్ష పత్రాలను స్టోరేజ్ పాయింట్ల నుంచి పరీక్షా కేంద్రాలకు తరలింపు మొదలు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరిం చాలన్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్ ఫేక్ న్యూస్ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరిం చాలన్నారు ఫ్లైయింగ్ స్వాడ్ బృందాలతో పాటు పలు సిటింగ్ స్క్వాడ్లు విధుల్లో పాల్గొన్నాయన్నా రు .

Related Articles

పలు బీటీ రోడ్లకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –కే గంగవరం, మే 16: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. […]

చౌక రేషన్ దుకాణాల పని వేళలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 29: ఉదయం 8.00 నుండి 12.00 గంటల వరకు నుండి సా. 4.00 గంటల నుండి 8.00 గంటల వరకు రేషన్ […]

డాక్టర్ పి ఎస్ శర్మ కు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అభినందనలు

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, మార్చి 03: 56 దేశాల సభ్యత్వం కలిగిన కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ లో క్షయ […]

అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు బీచ్, సినీ నటి హెబ్బా పటేల్ రాక

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాం బీచ్ లో అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరగనున్నాయి.ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరోయిన్ […]