పర్యాటకం,గార్మెంట్స్ తయారీ, పాడి పరిశ్రమల అభివృద్ధికి మంచి అవకాశాలు: ఎమ్మెల్యే ఆనందరావు

వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (విడిపి) విజయవంతం: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 15:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (విడిపి) విజయవంతమైందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో కలెక్టరేట్‌లో నిర్వ హించిన ఈ కార్యక్ర మంలో సుమారు 150 మంది కొను గోలు దారులు, అమ్మకం దారులు పాల్గొని సుహృ ద్భావ వాతావర ణంలో చర్చల ద్వారా అవగా హన పొందారని,జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విడిపి ప్రోగ్రాం భారత ప్రభుత్వం పరిశ్రమల, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ వివరించిన వివరాల ప్రకారం స్థానికంగా ఉన్న పరిశ్రమలను ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో అను సంధానించడం, స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ దొరకేలా దోహదపడటం ప్రధాన లక్ష్య మని పేర్కొన్నారు.కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తులు, కాయిర్, జూట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనపై అవగాహన కల్పించబడిందన్నారు.ఈ కార్యక్రమం “ఒక జిల్లా – ఒక ఉత్పత్తి” పథకంతో అనుసం ధానంగా ఉండి, జిల్లా ఉత్పత్తుల మార్కె టింగ్, ఎగుమతులకు కొత్త మార్గాలు తెరిచిందని తెలి పారు.ఎంఎస్ఎమ్ఈలకు విదేశీ కంపెనీలతో మార్కె టింగ్ అవగాహన కల్పిస్తూ, గెయిల్ టెండర్లలో 25% అవకాశాలు చిన్న పరిశ్ర మలకు కేటాయిం చిన అంశంపై కూడా పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. స్థానిక శాసనసభ్యులు ఆనందరావు మాట్లాడుతూ, పర్యాటకం, గార్మెంట్స్ తయారీ, పాడి పరిశ్రమల అభివృద్ధికి మంచి అవ కాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముం దుకు వస్తే ఏపీఐఐసీ (APIIC) మరియు సి ఎస్ ఆర్ ద్వారా అవసరమైన వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గెయిల్ వారి టెండర్లలో 25% ఎంఎస్ఎమ్ఈలకు ఇచ్చే విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పిం చారన్నారు ఎం ఎస్ ఎం ఈ సపోర్టింగ్ అంశాలపై సమగ్ర అవగాహన పెంపొం దించా రన్నారుఈ కార్యక్ర మంలో వెండర్ డెవలప్మెం ట్ కార్పొరేషన్ సంప్రదింపు దారులు వేణు గోపాల్, ప్రతినిధి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

అమలాపురం ప్రజా వేదిక లో 218 అర్జీలు స్వీకరించిన కలెక్టర్స్ మరియు రెవిన్యూ అధికారులు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 6: అర్జీదారుల వ్యక్తిగత, సామాజిక సమస్యలను సంతృప్తికర స్థాయిలో నాణ్యతతో పరిష్కరిస్తూ పీజిఆర్ఎస్ నిర్వహణ తీరు పట్ల అర్జీదారులలో విశ్వసనీయతను పెంపొందించాలని […]

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట జూన్ 01: పలు ఆసుపత్రుల్లో ఇటీవల వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 17 మందికి రూ.13 […]

ఊ అంటవా మామ అంటూ క్రిస్టియన్ పాటలు: కొండా సురేఖ సీరియస్

క్రిస్మస్ వేడుకల్లో ఊ అంటవా మామ అంటూ క్రిస్టియన్ పాటలు ఏంటి: మంత్రి కొండా క్రిస్టియన్ పాటల్లో ఊ అంటవా మామ వంటి పాటలను జోడిస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. వరంగల్ తూర్పు […]

బోడసకుర్రు గ్రామం నిర్మించిన టిడ్కో గృహాలు నివాసితులకు కనీస వసతులు కల్పిస్తూ… కలెక్టర్ మహేష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -అల్లవరం ఆగస్టు 07: స్థానిక పురపాలక సంఘ పరిధిలో గృహాలబ్ధిదారులకు బోడస కుర్రు గ్రామంలో నిర్మించిన టిడ్కో సముదాయ గృహాల లో నివాసితులకు […]