అయినవిల్లి తహసిల్దార్ సిహెచ్. నాగలక్ష్మమ్మను పరామర్శించిన జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

భారతీయ న్యాయ స్మృతి (భారత న్యాయ సాంహిత – BNS)లోని సెక్షన్ల కింద కేసు నమోదు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –
అమలాపురం, జూన్ 6, 2025

అయినవిల్లి తహసిల్దార్ సిహెచ్. నాగలక్ష్మమ్మను పరామర్శించిన జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

దాడి చేసిన నిందితుడిపై చట్టపరమైన చర్యలకు ఆదేశాలు

అయినవిల్లి మండలం తహసిల్దార్ సీ హెచ్ నాగలక్ష్మమ్మ పై జరిగిన దాడి ఘటన పై డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయినవిల్లి మండలం తొత్తరమూడి శివారు జోగిరాజుపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి మీసాల సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం తహసిల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించి, తహసిల్దార్ సిహెచ్. నాగలక్ష్మమ్మ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

ఈ నేపథ్యంలో కలెక్టర్ తహసిల్దార్కి ఫోన్ చేసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె ఎడమ చేతి పై చిన్న గాయం అయిందని కలెక్టర్ కి తెలిపారు.ఆమె త్వరగా కోలుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విధి నిర్వహణలో నిమగ్నమైన అధికారిపై అలాంటి దాడి జరగడం బాధాకరమని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిందితుడిపై భారతీయ న్యాయ స్మృతి (భారత న్యాయ సాంహిత – BNS)లోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP)ను కలెక్టర్ ఆదేశించారు. అయినవిల్లి సబ్ ఇన్స్పెక్టర్ నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఆమెకు అన్ని విధాలుగా మద్దతు ఇస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు.

Related Articles

తక్షణ సహాయముతో ప్రాణాలను కాపాడిన సి ఐ ప్రశాంత్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఫిబ్రవరి 02:సిఐ ప్రశాంత్ కుమార్ తక్షణ ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న ఘటన అమలాపురంలో వైరల్ అవుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – పి.గన్నవరం జనవరి 26: 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]

ప్రజా ఫిర్యాదులు పరిష్కారం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 21, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు, మండల స్థాయిలో ప్రజాఫిర్యాదులను క్రమ పద్ధతిలో పరిష్కరించేందుకు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా […]