
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -పి.గన్నవరం జూలై 17:
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా పి గన్నవరం మండల నరేంద్రపురం గురుకులపాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డా” డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి,అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు గురువారం సాయంత్రం ఆరుగంటలకు పాఠశాలను సందర్శించిచారు. ఈ సందర్భంగా మమత స్వచ్చంద సేవా సమితి వ్యవస్థాక అద్యక్షులు డా,కోరుకొండ జాన్,పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బందిగా ఉన్న సమస్యలు ప్రదానంగా వంట శాల ప్రక్కన మురుగు వాడకం నీరు గంజి నీళ్లు వెళ్లే మార్గం లేఖ బోజనశాల ప్రక్కనే నిల్వ ఉండి దుర్వోచన వలన ఈగలు దోమలు చాలా ఎక్కవగా ఉన్నాయి. మురుగు నీరు వెళ్లేందుకు పైపు లైను ద్వారా దగ్గరలో ఉన్న మురుగు కాలువకు మల్లించాలని,పాఠశాల భవనములు చుట్టూ ఉన్న ప్రహరీగోడ ఎత్తు పెంచాలని పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ బాగుచేయించి అనువైన వాతావరణం కల్పించాలని ఇంటర్ పదవ తరగతి విద్యార్థులకు మంచాలు ఏర్పాటు దోమల మెస్ లు మరియు ప్యాన్ లు ఏర్పాటు చేయాలని పాఠశాల ఆవరణలో బారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా” బిఆర్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఎంపి హరీష్ మాధుర్ కు కోరుకొండ జాన్ అందజేసారు, వినతి పత్రం పరిశీలించిన మంత్రి అన్ని సమస్యలు తొంరలోనే పరిష్కారిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డిసిఒ శైలజ, ఎస్సీ కార్పొరేషన్ ఈడి సత్యవతి,తహసీల్దారు పల్లవి ప్రిన్సిపాల్ వేణు,ఊండ్రు శ్రీరామారావు,నక్కా సునీల్,సంసాని పెద్దిరాజు,నక్కా వీరవెంకటసత్యనారాయణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.