ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు గా గుబ్బల శ్రీనివాస్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం డిసెంబర్ 21:డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు ఏకగ్రీవంగా ఎంపిక కాబడిన ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కరుటూరు నరసింహారావు లను పలువురు ప్రజాప్రతి నిధులు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు పూర్తి కావడంతో జవసత్వాలు వచ్చాయని తెలిపారు. సాగునీటి వనరులు నిర్వహణ స్థానిక సంఘాలే చేప ట్టాలని ప్రభుత్వం భావించి ఈ మేరకు ఎన్నికలు కూడా పూర్తి చేసిందన్నారు. గత కొంతకాలంగా పూడి కతీత పనులు, మరమ్మ త్తు, కాలువ గట్ల బలోపే తం వంటి వాటిపై క్షేత్రస్థా యిలో ముఖ్యమైన పనులు నిలిచిపోయా యని ఇప్పుడు సాగునీటి సంఘాలకు తిరిగి ఊపిరి లూదడం ద్వారా నీటి వనరుల సంరక్షణ నిర్వ హణ కు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎన్నిక కాబడిన వారిని కోరారు. నీటి సంఘాలు ఎన్నికలలో గెలిచిన అభ్య ర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు సాగునీటి రంగాన్ని గాడి లో పెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టి సం ఘాల భాగస్వామ్యంతో కాలువ చిట్ట చివరి ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా నిర్వహణ ఉండాలని ప్రభుత్వం భావించిందన్నారు నదులు జలాశయాలు నీటి వనరుల నిర్వహణ సంరక్షణ ప్రక్రియలను సంఘాలు చేపట్టాలన్నా రు ప్రభుత్వం సాగునీటి పారుదల రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ఎన్నికల నిర్వహిం చిందన్నారు ఎన్నికలలో ఎంపిక కాబడిన కార్యవర్గ అధ్యక్షులు ఉపాధ్యక్షుల ను ఎమ్మెల్యే లు ఈ సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు సాగునీటి వినియోగదారుల సంఘానికి ఎన్నికైన వారిని అభినందించి, రైతుల కోసం రైతు సంక్షేమమే పరమావధిగా బాధ్యతగా పనిచేయాలని సూచించారు సాగునీటి సంఘాల ఎన్నికల్లో చివరి ఘట్టo నేటితో ముగిసిందనీ మూడు దశల్లో నిర్వ హించిన ఈ ఎన్నికల్లో సాగునీటి వినియోగదా రుల సంఘాలకు అధ్య క్షులు ఉపాధ్యక్షులు నియమించబడ్డారన్నారు రైతులకు సేవ చేయాలని వారు ఆకాంక్షించారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో రాజో లు చిట్టచివ రి డెల్టా ప్రాంతమని, ఖరీఫ్ సీజన్లో చిట్టచివరి వరకు సాగు నీరు సకాలంలో అందక సాగు ఆలస్యం అవ్వడం తో పాటుగా పంట కోత సమయంలో తుఫాన్ విపత్తులు వంటి ముంపు వంటి బెడద వల్ల రైతాం గం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నా రని, ఆ సమస్యల పరిష్కారానికి ఈ ప్రాంతానికి చెందిన అభ్యర్థిని ప్రాజెక్ట్ కమిటీ కి ఎంపిక చేయా లని కోరిన మీదట ఏకగ్రీవంగా ఈ ప్రాంత అభ్యర్థి గుబ్బల శ్రీనివాస్ ను అధ్యక్షుని గాఎంపిక చేయడం సం తోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి ఉపాధ్య క్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్షులు అల్లాడ స్వామి నాయుడు ప్రజాప్రతినిధులు తదిత రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

కీలక నిర్ణయం..గేర్ చేంజ్ చేసిన జగన్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -విజయవాడ జనవరి31:ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా ముఖ్య నేత సాయిరెడ్డి రాజీనామాతో జగన్ గేర్ చేంజ్ చేశారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో […]

క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో రాణించాలి ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 16: క్రీడాకారులు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో క్రీడా స్ఫూర్తితో ప్రపంచ స్థాయిలో రాణించి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కంప్యూటర్ ఆధారిత పరీక్ష రీ షెడ్యూల్ చేయబడింది: కొత్త తేదీలను తనిఖీ చేయండి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం ఆగస్టు 02: The High Court of Andhra Pradesh has released a new schedule for the computer-based […]

కృష్ణా జిల్లా నాగాయలంక మత్స్యకారులు మృతి

బోటు నుంచి జారిపడిన మత్స్యకారులు.రెండుకు చేరిన మృతుల సంఖ్య V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అంతర్వేది జూన్ 16: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలోని సాగర సంగమం […]