గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, మెరుగైన సౌకర్యాలు:మంత్రి డా.డోలా శ్రీ బాల

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- రాజోలు,పి. గన్నవరం జూలై 17 :

విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలి

మంత్రి లోకేశ్ చేతిలో విద్యార్థుల భవిష్యత్తు సురక్షితంగా ఉంది

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

కోనసీమ జిల్లా శివకోడూరు, నరేంద్రపురం గురుకులాల్లో మంత్రి డా. స్వామి ఆకస్మిక తనిఖీ

కిచెన్, స్టోర్ రూమ్,డార్మిటరి, మరుగుదొడ్లు పరిశీలన

విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్న మంత్రి

డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ / రాజోలు,పి. గన్నవరం జూలై 17 :

గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం,విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి స్వామి పర్యటించారు.

రాజోలు నియోజకవర్గం శివకోడూరు, పి. గన్నవరం నియోజకవర్గం నరేంద్రపురం బాలికలు, బాలురు గురుకులాల్లో మంత్రి డా. స్వామి ఎంపీ గంటి హరీష్ మాధుర్, టీడీపీ నేత నామన రాంబాబు తో కలసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కిచెన్, స్టోర్ రూమ్, మరుగుదొడ్లు పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి పాఠశాలలో అందుకున్న సౌకర్యాలు,సమస్యలు, టీచర్ల బోధనా తీరు విద్యార్థులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం,విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలి.విద్యార్థుల పట్ల మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గురుకులాలు ఐఐటీ నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు 10కి పెంచాం, ఐఐటీ నీట్ లో త్రుటిలో అర్హత కోల్పోయిన విద్యార్థులకు ఐఐటీ, నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నాం.

గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు 11 రకాల వస్తువులతో కాస్మోటిక్ కిట్స్ అందజేస్తాం. ఏదైనా అనారోగ్యంతో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉండేందుకు సాంత్వన పథకం ద్వారా రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. లోకేశ్ చేతిలో రాష్ట్ర విద్యార్థుల భవిషత్తు సురక్షితంగా ఉందని మంత్రి స్వామి అన్నారు.

Related Articles

ఏడాదిలోనే ఎంతో చేశాం, చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని కూటమి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి:మంత్రి డా.డోలా శ్రీ బాల

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే కూటమి ప్రభుత్వం సుస్థిర కాలం అధికారంలో ఉండాలి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోనసీమ జిల్లా రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న […]

అమలాపురం పట్టణం ఎస్ కే బి ఆర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్

కేంద్రాలలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పట్టభద్రులు

డాక్టర్ కారెం రవితేజకు మాల మహానాడు ఆధ్వర్యంలో ఘన సన్మానం.

కోనసీమ కేర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ కారెం రవితేజకు మండల మాలమహానాడు ఆధ్వర్యంలో ఘనసన్మానం చేసారు డా.రవితేజకు “బెస్ట్ ఎక్స్లెన్స్ డాక్టర్ “అవార్డు వచ్చిన సందర్భంగా స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో […]

విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు: జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక -డిసెంబర్ 2024:విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు అని విద్యుత్ పొదుపుగా వాడి ఆధాచేస్తూ భావితరాలకు ఇంధన వనరులపై భరోసాను కల్పించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]