
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జులై 18:

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలోని శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాల జీ కళాశాల మరియు స్థానిక భట్లపాలెం బి వి సి ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాల నందు నిర్వహించడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాo తి వెల్లడించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నందు రాత పరీక్ష నిర్వహణకు సంబం ధించి వివిధ శాఖలతో సమన్వయ కమిటీ సమా వేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 386 మంది ఈ యొక్క రాత పరీక్షకు హాజ రుకానున్నారని వీరిలో శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నా లజీ లో 206 మంది హాజరు అవుతారని, భట్లపాలెం ఇంజనీరింగ్ కళాశాల నందు 180 మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు వెరసి జిల్లా వ్యాప్తంగా 386 మంది హాజరుకానున్నార న్నారు. ఈ యొక్క రాత పరీక్ష ఈనెల 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల నుండి సా యంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో ఉప తాసిల్దార్ గోపాలకృష్ణ బి వి సి ఇంజనీరింగ్ కళాశాలలో ఉప తాసిల్దార్ సుబ్రహ్మణ్యేశ్వర రావు లైజ న్ అధికారులుగా వ్యవ హరించాలన్నారు. ఈ రోజే కళాశాలలను సందర్శించి ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహిం చేందుకు కంప్యూటర్లు సిద్ధంగా ఉన్నది లేనిది ముందస్తు పరిశీలన చేయా లన్నారు. విద్యుత్ సరఫరా కు బదులుగా ప్రత్యా మ్నా య ఏర్పాట్లు కూడా చేప ట్టాలన్నారు. మున్సిపల్ కమిషనర్ డిపిఓ శానిటేషన్ త్రాగునీటి ఏర్పాట్లు చేప ట్టాలన్నారు. ఏపీఈపీడీ సీఎల్ ఇంజనీర్లు నిరంత రాయంగా విద్యుత్ సరఫరా ఉండేటట్లు చర్యలు గైకొనా లన్నారు. అదేవిధంగా సి సి టీవీ సర్వైలెన్స్ కనెక్షన్ ఏర్పాట్లు చేపట్టాలన్నారు స్థానిక ఆర్డిఓ వారు పోలీస్ శాఖ సమన్వయంతో పరీక్ష సమయాలలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతోపాటు శాంతి భద్రతల పరిరక్షణ ,పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఎటు వంటి జిరాక్స్ షాపులు తెరవ కుండా మూయించి వేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రెండు పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను ప్రాథమిక వైద్య సేవలతో ఏర్పాటు చేయా లన్నారు. ఏపీఎస్ఆర్టీసీ వారు అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలన్నారు రాత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పారదర్శ కంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి సమ న్వయం వహించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్ర మంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి, డిఎంహెచ్వో ఎం దుర్గారావు దొర , మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, వివిధ శా ఖల అధికారులు పాల్గొ న్నారు.