
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజమహేంద్రవరం ఆగస్టు19:
హజరు కానున్న 25,173 మంది అభ్యర్థులు
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు – ఆగస్ట్ 20వ తేదీ నుండి 24 వరకూ
టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, కాపీయిస్ట్, డ్రైవర్ పోస్టులకు నైపుణ్య పరీక్షలు
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత
రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జ్యుడీషియల్ జిల్లాలలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్–III, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల నియామక కంప్యూటర్ ఆధార పరీక్షలు (CBT) నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలియ చేశారు.
ఈ పరీక్షలు 20.08.2025 నుండి 24.08.2025 వరకు జిల్లాలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షిఫ్టుల వారీగా పరీక్ష సమయాలు ఉంటాయని, షిఫ్ట్ రిపోర్టింగ్ సమయం గేట్ క్లోజ్ లాగిన్ పరీక్ష ప్రారంభం ముగింపు (సాధారణ) వివరాలకు అదనంగా కోర్టు అధికార ప్రతినిధి, పరీక్షా నిర్వాహకులు గుర్తించిన దివ్యాంగుల (PWD) కోసం అరగంట అదనపు సమయం ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. దివ్యాంగులకి సహాయకారి (Scriber) అవసరం ఉంటే ఆయా పరీక్షా కేంద్రాల్లో తగిన ఆధారాలు చూపించి, ఆమేరకు అర్హత కలిగిన వారికి ఆమేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు
మొదటి షిఫ్ట్ ఉ.7:30 ఉ.8:45 అభ్యర్థులను అనుమతించడం జరుగుతుందన్నారు. పరీక్షా సమయం ఉ .9:00 నుంచి 10:30 వరకు దివ్యాంగులకు ఉ. 11:00 వరకు.
2వ షిఫ్ట్ ఉ. 11.00 నుంచి మ.12:15 వరకు అభ్యర్థు లను అనుమతించడం జరుగుతుందన్నారు. పరీక్షా సమయం మ.12.30 నుంచి మ.2.00 వరకు దివ్యాంగులకు మ.2.30 వరకు
3 వ షిఫ్ట్ మ.2.30 నుంచి సా.3 45 వరకు అభ్యర్థులను అనుమతించడం జరుగు తుందన్నారు. పరీక్షా సమయం సా.4.00 నుంచి మ.సా.5.30 వరకు దివ్యాంగులకు సా.6.00 వరకు
అభ్యర్థులకు ముఖ్య సూచనలు తెలియ చేస్తూ, పరీక్షా గేట్లు పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు మూసివేయ బడతాయన్నారు.
అభ్యర్థులు హాల్ టికెట్ మరియు చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో ఐడీ తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ సమస్యల కోసం హెల్ప్‌డెస్క్ ఫోన్: 0863-2372752, ఇమెయిల్: helpdesk-hc.ap.@alj.gov.in ను సంప్రదించ వచ్చు అని పేర్కొన్నారు.
CBT పరీక్షే ఫైనల్ ఫలితాలే అభ్యర్థుల ఎంపిక కోసం ప్రామాణికం అని, ఇంటర్వ్యూ ఉండవని తెలిపారు. స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డ్రైవర్ పోస్టులకు విడిగా నైపుణ్య పరీక్షలు నిర్వహించడం జరుగతుందని తెలిపారు.
బెంచ్‌మార్క్ వైకల్యం గల అభ్యర్థులకు అవసరమైతే స్క్రైబ్ సౌకర్యం కోర్టు ద్వారా నియమించబడిన ఎగ్జామినర్ TCS సెంటర్ ఇన్‌ఛార్జ్ అనుమతితో కల్పించడం జరుగుతుంది అని పేర్కొన్నారు.
అధికారులకి పరిపాలనా సూచనలు చేస్తూ .. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న కాకినాడ జిల్లా, డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ అధికారులకి సమాచారం ఇవ్వాలని సూచించారు.
విద్యుత్ శాఖ పరీక్షల సమయంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పోలీసు శాఖ – ఆధ్వర్యంలో షిఫ్ట్ వారీగా అన్ని కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ – బస్ స్టాండ్ నుండి పరీక్షా కేంద్రాల వరకు ప్రత్యేక బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా బస్సుల పై పరీక్షా కేంద్రాలు వివరాలు తెలియ చేయాలని స్పష్టం చేశారు.
TCS సాంకేతిక బృందం – ప్రతి కేంద్రంలో సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం సిబ్బంది అందుబాటులో ఉంటారని, అవసరమైతే 0863- 2372752 ను సంప్రదించాలని తెలిపారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పరీక్షా కేంద్రాలు, తేదీలు హాజరయ్యే అభ్యర్ధుల వివరాలు
అమలాపురం పరిధిలోని శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (చెయ్యేరు గ్రామం)లో 1710 మంది అభ్యర్థులు 22, 23 మరియు 24 ఆగస్టు తేదీలలో పరీక్షలకు హాజరుకానున్నారు. అదే విధంగా బట్లపాలెం వద్ద ఉన్న బి.వి.సి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కేంద్రంలో 1485 మంది అభ్యర్థులకు 22, 23, 24 ఆగస్టు తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నారు.
కాకినాడ జిల్లాలోని రాయుడుపాలెం వద్ద సాఫ్ట్ టెక్నాలజీస్ కేంద్రంలో 2350 మందికి 20, 21, 22, 23 ఆగస్టు తేదీలలో పరీక్షలు జరుగుతాయి. అచ్యుతాపురం రైల్వే గేట్ దగ్గర ఉన్న ION డిజిటల్ జోన్ (IDZ)లో 6265 మంది అభ్యర్థులు 20 నుండి 24 ఆగస్టు వరకు ఐదు రోజుల పాటు పరీక్షలకు హాజరు కానున్నారు. రాజమహేంద్రవరం పరిధిలో లూథర్‌గిరి వద్ద ఉన్న రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ లోని ION డిజిటల్ జోన్ (IDZ)లో అత్యధికంగా 12,913 మంది అభ్యర్థులు 20 నుండి 24 ఆగస్టు వరకు ఐదు రోజుల పాటు పరీక్షలకు హాజరు కానున్నారు. అదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సూరంపాలెం కేంద్రంలో 450 మంది అభ్యర్థులకు 24 ఆగస్టు తేదీన పరీక్ష జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా పోలీసు, ఆర్టిసి, సమాచార, తదితర సమన్వయ శాఖల అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.