

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అల్లవరం జూన్ 16:

షెడ్యూల్ కులాల విద్యార్థినీ విద్యార్థులకు సంక్షేమ వసతి గృహాలలో ఇంటి మాదిరిగా చదువుకునే వాతావరణాన్ని కల్పించి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం అహర్నిశలు పాటుపడు తుందని ఆ దిశగా లక్షిత వర్గాల వారు ఈ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతమైన పౌరులుగా ఎదగాలని సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభా వంతుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రివ ర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల ఆంజనేయ స్వామి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని గో డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర బాలికల పాఠశాలలను ఆయన సందర్శించి విద్యార్థినీ విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని రకాల వసతులను ఓన గూర్చడం జరుగుతోందని వాటిని సద్వినియోగం చేసుకొని ఉత్తమమైన పౌరులుగా జీవించాలని ఆకాంక్షించారు. వసతి గృహాలలో వసతులు మెనూ, ఆహార నాణ్యత పరిశుభ్రత, సురక్షితమైన త్రాగునీరు సరఫరా, నాణ్యమైన విద్యాబోధన, తదితర అంశా లపై ఆరా తీశారు. బాలికల వసతి గృహం జ్ఞాన మందిరం వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి శంకు స్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తదుపరి క్రీడా ప్రాంగణం నందు బాస్కె ట్బాల్ కోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

విద్యాపరంగా ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోం దని క్షేత్రస్థాయి నుండి మెరికల్లాంటి విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిది ద్దుకునేందుకు ఈ యొక్క అవకాశాలను పునాదిగా బేస్ గా చేసుకుని రాణిం చాలని మంత్రివర్యులు అభిలసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, అమ్ముడు ఆ చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు ఆర్డీవో కే మాధవి తాసిల్దార్ నరసింహారావు నాయకులు మెట్ల రమణబాబు తదితరులు పాల్గొన్నారు.