అమలాపురం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక అమలాపురం సెప్టెంబర్ 03:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బుఊ నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసన సభ్యులు అయితాబత్తుల ఆనంద రావు లాంఛనముగా ప్రారంభించారు.
డి ఎన్ శెట్టి & డి వి రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక భవనం ను తాత్కాలికంగా తీసుకొని ఒక ఆఫీసు రూమ్ ను, ఒక కంప్యూటర్ లాబ్ ను, మూడు క్లాస్ రూమ్స్ ను శాసన సభ్యులు ఆనంద రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
కళాశాల అధ్యాపకులు డా” ఏం.బాల స్వామి ఆహ్వానం పలుకగా కళాశాల ప్రిన్సిపాల్ డా వి నరసింహ స్వామి అధ్యక్షత వహించిన సభలో ప్రస్తుతం ఈ కళాశాల లో మూడు డిగ్రీ కోర్సులు ఉన్నాయని, అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని, వచ్చే విద్యా సంవత్సరం నుండి మరో మూడు కోర్సులు వస్తాయని, అనుభవం గల అధ్యాపకులు ఈ కళాశాలలో బోధిస్తున్నారనిప్రిన్సిపాల్ నరసింహ స్వామి చెప్పారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో ఈ ప్రాంత సమస్యలు వివరించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అవసరం ఎంతైనా ఉందని చెప్పినపుడు వెంటనే ఏ టి ఆర్ రిపోర్ట్ సమర్పించి కార్యరూపం దాల్చడానికి తోడ్పడ్డారని చెప్పారు.
ప్రస్తుతం పేరూరు కౌశిక వంతెన సమీపం హైవే రోడ్ ప్రక్కన స్థలం సేకరించామని, రెండు కోట్ల రూపాయల నిధులు కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ సహకారం తో తదితర చమురు సంస్థల నుండి సేకరించామని తెలిపారు. త్వరలోనే భవనాలకు శంకుస్థాపన చేసి వచ్చే విద్యా సంవత్సరానికి పక్కా తరగతి గదులు అందిస్తామని చెప్పారు.
డి సీ ఎం ఎస్ చైర్మన్ మాట్లాడుతూ పేరూరు లో ప్రారంభించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెప్పారు.
ట్రేడ్ అండ్ కామర్స్ సబ్యులు కల్వకొలను తాతాజీ మాట్లాడుతూ ఎంతో కాలం తర్వాత ఈ ప్రాంతానికి మొదటి సారిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు కావడం పేద మద్య తరగతి విద్యార్థులు తక్కువ ఫీజు తో నాణ్యమైన విద్య పొందటానికి అవకాశం వచ్చినందుకు స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అముడా ఛైర్మన్ అల్లాడ స్వామినాయుడు, రాష్ట్ర నాయకులు మెట్ల రమణ బాబు, మార్కెటింగ్ కమిటీ చైర్పెర్సన్ శ్రీమతి అధికారి జయలక్ష్మి, పేరూరు గ్రామ సర్పంచ్ దాసరి అరుణా డేవిడ్, స్థల దాతలు దొమ్మేటి శ్యామ్ ప్రకాష్, బొర్రా ఈశ్వర రావు, మంతా ఫణి కుమార్, పేరూరు ఎంపీటీసీ సబ్యులు, హెచ్ ఎన్. విజయ కుమారి, వైస్ ప్రిన్సిపాల్ పీ కరుణశ్రీ, అధ్యాపకులు డా. ఏం బాల స్వామి, డా బి ఆశీష్ బాబు, పి శేఖర్, సీనియర్ అసిస్టెంట్ తోట మురళీ కృష్ణ, కరుణ, దుర్గా ప్రసాద్, శివ ప్రసాద్, రాంబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

మంత్రి సుభాష్ ఔదార్యం !పండగ చేసుకోండి మిత్రులారా !

ఏరియా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందికి సంక్రాంతి కానుక రూ.65₹ వేలు ఇచ్చిన మంత్రి సుభాష్ పండుగ అంటే.. ప్రతి ఇంట్లోనూ సందడే.. అందులోనూ తెలుగు వారికి అతి ప్రీతిపాత్రమైన సంక్రాంతి అంటే ఎంత సందడో..ఇష్టమో […]

సూపరిండెంట్ బి మురళీ కృష్ణ అంబాజీపేట తహసిల్దార్ జె.వెంకటేశ్వరి పదవీ విరమణ శుభాకాంక్షలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం, ఫిబ్రవరి 28,2025 కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరిండెంట్ బి మురళీ కృష్ణ , అంబాజీపేట తహసిల్దార్ జె.వెంకటేశ్వరి పదవీ విరమణ కలెక్టరేట్ […]

V9 ప్రజా ఆయుధం మీడియా కు సహకరిద్దాం!

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ప్రింట్ మీడియా సంస్థకు ఆర్థికంగా సహకరిస్తారని కోరుచున్నాము. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న 7 నియోజకవర్గ ప్రజానీకానికి ప్రజా ఆయుధం దినపత్రిక మీ […]

కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త వహించాలి: డాక్టర్ కారెం రవితేజా MD

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం మే 26: కోవిడ్ మహమ్మారి మళ్లీ వస్తుంది పలు జాగ్రత్తలు తీసుకోవాలి అని, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]