

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ /అమలాపురం, జూలై 16 :
పేదల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ద్వేయం
ఉపాధి, ఉద్యోగాలే లక్ష్యంగా విద్యార్థులకు విద్యా బోధన
గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, మెరుగైన సౌకర్యాలు
విద్యార్థుల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి స్వామి పర్యటన
అల్లవరం మండలం గోడి గ్రామంలోని అంబేద్కర్ గురుకులాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి

పేదల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం నాడు కోనసీమ జిల్లా అమలాపురం జిల్లాలో మంత్రి పర్యటించారు. అల్లవరం మండలం గోడి గ్రామంలోని అంబేద్కర్ బాలికల గురుకులంలో రూ. 20 లక్షలతో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, బాస్కెట్ బాల్ కోర్టు, రూ.15 లక్షలతో ప్లే గ్రౌండ్ నిర్మాణానికి మరియుబాలుర గురుకులంలో రూ.24 లక్షలతో సీసీ రోడ్డు, డైనేజీ నిర్మాణం, రూ.15 లక్షలతో ప్లే గ్రౌండ్ నిర్మాణానికి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి స్థానిక ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావుతో కలిసి శంకుస్థాపనలు చేశారు.

అనంతరం విద్యార్థినిలు, విద్యార్థులతో విడివిడిగా ముఖాముఖి నిర్వహించి పాఠశాలలో అందుకున్న సౌకర్యాలు,సమస్యలు, టీచర్ల బోధనా తీరు విద్యార్థులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…… పేదల అభ్యున్నతే ద్వేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఉపాధి, ఉద్యోగాలే లక్ష్యంగా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నాం. విద్యార్థుల పట్ల మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.

గురుకులాలు ఐఐటీ నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు 10కి పెంచాం, ఐఐటీ నీట్ లో త్రుటిలో అర్హత కోల్పోయిన విద్యార్థులకు ఐఐటీ, నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నాం. గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు 11 రకాల వస్తువులతో కాస్మోటిక్ కిట్స్ అందజేస్తాం. ఏదైనా అనారోగ్యంతో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉండేందుకు సాంత్వన పథకం ద్వారా రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వంట మనుషులకు శిక్షణ ఇవ్వాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు.

విద్యార్థులకు అందిస్తున్న ప్రతి వస్తువును మంత్రి లోకేష్ ప్రత్యేకంగా పరిశీలన చేస్తున్నారని మంత్రి స్వామి అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ బాలుర పాఠశాలలో తమకు తరగతి గదులు సరిపోవడం లేదని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.పాఠశాలలో అవసరమైన అదనపు తరగతి గదులు వెంటనే మంజూరు చేస్తానని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి హామీ ఇచ్చారు.

అనంతరం నల్లమిల్లి గ్రామంలో ఎంపీ హరీష్ , ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావుతో కలసి మంత్రి స్వామి రూ.15 లక్షలతో అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో పరిపాలన భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
