
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -పి. గన్నవరం సెప్టెంబర్ 21:
అయినవిల్లి మండలం రావిగుంట చెరువు గ్రామానికి చెందిన చేట్ల రామారావు వైసీపీ పార్టీ రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం రావిగుంట చెరువు విలస గ్రామపంచాయతీ వాసి చేట్ల రామారావు వైసీపీ పార్టీ రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఆయనకు నియామక పత్రాన్ని అందజేసింది. రాష్ట్ర స్థాయిలో తనకు పదవిని కేటాయించినందుకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికు జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డికు,పి. గన్నవరం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మరియు పదవికు సహకరించిన పార్టీ అగ్ర నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రామారావు గతంలో వివిధ పార్టీ పదవులతో పాటు ప్రభుత్వ అనుబంధ సంస్థ లో సభ్యులుగా ఆయన పనిచేశారు. ఆయనకు వైసిపి పార్టీ రాష్ట్రలో పదవి బాధ్యతలు అప్పగించిన సందర్భంగా ఆయన మిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.