ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యలుచే వైద్య పరీక్షలు నవ్యాంధ్ర ప్రదేశం మొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బాబు నాయుడు 75 వ జన్మదినాన్ని పురస్కరించుకొని మీ ఆరోగ్యం- మా బాధ్యత అనే నినాదంతో “సత్యం వాసంశెట్టి ఫౌండేషన్” ఆధ్వర్యంలో ఈ నెల ఏప్రిల్ 20 న ఉదయం 9 గంటలకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,రామచంద్రపురం వి ఎస్ ఎమ్ ఇంనీరింగ్ కళాశాల ఆవరణలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులైన అపోలో, మెడీ కవర్, మెడ్ వే సంజీవని, అగర్వాల్ కంటి ఆసుపత్రి తదితర ఆసుపత్రుల నుంచి వైద్యులు పాల్గొని ఉచిత వైద్య సేవలు, ఉచితంగా మందులు అందిస్తారని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులతో పాటు, ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులకు, స్త్రీల( గైనిక్ ) సమస్యలకు నిపుణులచే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు అన్నారు. ఈ వైద్య శిబిరంలో ఈసీజీ, టు డి ఎకో, బిపి, షుగర్ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారన్నారు. ఏప్రిల్ 20 న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని మంత్రి సుభాష్ తెలిపారు. రామచంద్రపురం నియోజవర్గంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మంత్రి సుభాష్ ఈ సందర్భంగా తెలిపారు.
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం, ఏప్రిల్ 17: