ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారుల సముద్రపు వేటకు అడ్డులేదు: కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 26:

మత్స్యకారుల సమస్యలపై మత్స్యకార ప్రతినిధులు మత్స్య శాఖల అధికారుల తో కూలంకశంగా పూర్తిగా చర్చించి మరో 10 రోజుల్లో అందరికీ ఆమోదయో గ్యంగా సముద్ర తీర ప్రాంతంలో చేపల వేట పరిమితులను నిర్ణయించడం జరుగుతుందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారుల సముద్రపు వేట సమస్యలను విన్నవించేందుకు పిఠాపురం మాజీ శాసనస భ్యులు వర్మ నేతృత్వంలోని మత్స్యకార సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ వారిని కలిసి సమస్యలను వివరించారు.

ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎక్కడయినా స్వేచ్చగా వేట చేసుకునే అవకాశం కలిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వారికి మాజీ శాసనస భ్యులు వర్మ వినతి పత్రాన్ని సమర్పించారు. యు. కొత్తపల్లి మండలంలో మత్స్య కారులు సము ద్రంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా. ఎక్కడయినా స్వేచ్చగా చేపల వేట చేసు కొనే హక్కు ఉందని వర్మ తెలిపారు. గతంలో 2014 -19 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాఉన్నపుడు నర్సాపురం దగ్గర అంతర్వే ది,బీమవరం వద్ద గొల్లపాలెం వైజాగ్ ఈ ప్రాంతాలలో వేటకు అభ్యంతరాలు కలిగి నప్పుడు అక్కడ జిల్లా కలెక్టర్, ఎస్.పి.లకు చెప్పి ఈ ప్రాంతాలలో వేట చేసుకునే అవకాశం కల్పించారన్నారు.

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాకు వేట చేసు కునే అవకశం ఈ ప్రాంతాల లో లేదనీ. దయచేసి మీరు అధికారులకు తెలియజేసి ఈ ప్రాంతాలలో మత్స్యకా రులు వేట కొనసాగించే విధంగా అవకాశం కల్పిం చాలని వర్మ జిల్లా కలెక్టర్ వారిని సవినయంగా కోరారు. ఈ అంశాలపై చర్చలు నిర్వహించిన పిదప జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ సముద్రంపై చేపల వేట పరిమితిని నిర్దేశిం చేందుకు మరొకసారి మత్స్యకార ప్రతినిధులు మత్స్య శాఖ అధికారులతో చర్చించి మరో పది రోజుల లో అందరికీ ఆమోదయో గ్యంగా సముద్రo పై చేపల వేట పరిమితులను నిర్ధారిం చడం జరుగుతుందని ఆయన మాజీ శాసనస భ్యులు వర్మకు మరియు మత్స్యకార ప్రతినిధులకు సూచించారు.

Related Articles

ప్రతి ఎకరాకి సాగునీరు//కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం, మార్చి 24: ప్రతి ఎకరాకి సాగునీరు అందించేలా అధికారులు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ […]

ఉపాధ్యాయులు జీవిత మార్గదర్శకులు సమాజ నిర్మాణ శిల్పులు: కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 05: ఉపాధ్యాయులు జీవిత మార్గదర్శకులు సమాజ నిర్మాణ శిల్పులని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ […]

అమలాపురంలో అల్లాడ స్వామి నాయుడు.ఘనంగా పదవీ ప్రమాణ స్వీకారోత్సవం

V9ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం డిసెంబర్ 18: అమలాపురం జిల్లా కేంద్రం మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లోని అభివృద్ధి అంశాలపై ప్రతిపాదనలు క్రోడీకరించి సమర్పించిన ఎడల ప్రణాళికా బద్దంగా నా […]

మహిళలను అవమానించిన వారిని కఠినంగా శిక్షించాలంటూ భారీ ప్రదర్శన

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం జూన్ 10: సాక్షి యాజమాన్యం మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి మానవహారం చేసి సాక్షి ప్రతులు చింపివేత రామచంద్రపురంలో కదం తొక్కిన మహిళ […]