తల్లికి వందనం ఆర్థిక లబ్ధిని పొందే విధంగా భూ యాజమాన్యాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 16:

తల్లికి వందనం ఆర్థిక లబ్ధిని పొందే విధంగా భూ యాజమాన్యాల (జాయిం ట్ ఎల్ పి ఎం) భూముల ను విభజిస్తూ ఆ యొక్క పదక లబ్ధిని అర్హులందరికీ చేకూర్చాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి సర్వే సిబ్బందిని ఆదేశించారు. బుధవారం అమరావతి నుండి రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు అనగాని సత్యప్రసాద్ మరియు భూ పరిపాలన కమిషనర్ ఎన్ ప్రభాకర్ రెడ్డిలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జాయింట్ ఎల్పీఎంలు విభజన అందరికీ ఇండ్లు , రి వెరిఫికేషన్ ఆఫ్ అవుట్ సైడ్ అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఎస్సీ ఎస్టీ గ్రామాలు బరియల్ గ్రౌండ్ కు స్థల సేకరణ రీ సర్వే అంశాల పురోగతిపై వారాంతపు సమీక్ష జిల్లా జాయింట్ కలెక్టర్లతో జిల్లాల వారీగా నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ గ్రామాలలో బరియల్ గ్రౌండ్ విస్తీర్ణాలను ఆరా తీసి ఎంత విస్తీర్ణం మేర ఉన్నది నివేదిక సమర్పించాలన్నారు. అర్హు లందరికీ ఇళ్లకు సంబంధించి లేఔట్లలోని ఇప్పటివరకు లబ్ధిదారులకు పంపిణీ చేయని కాళీ జాగాలను గుర్తించి వాటిని అర్హుల అభీష్టానికి అనుగుణం గా పంపిణీ చేయాలన్నారు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకాల ఆర్థిక లబ్ధిని అర్హు లందరికీ చేకూర్చే దిశగా భూ సమస్యల పట్ల అధికారులు తక్షణమే స్పందించి అర్హులకు న్యాయం చేకూర్చాలన్నారు. జాయింట్ ఎల్పిఎం ఆన్లైన్ ప్రక్రియ రీ సర్వే పైలట్ గ్రామాలు పురోగతి రెండవ దశ గ్రామాల పురోగతి 13 నోటిఫికేషన్లు జారీ అం శాలపై ప్రత్యేక దృష్టి సారిం చి నిర్దేశిత గడువులోగా ఆశించిన పురోగతిని తీసు కుని రావాలని ఆదేశిం చారు. జిల్లాలో హైలెట్ ప్రాజెక్టులో 17 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిం దని ఈ ప్రక్రియకు సం బంధించి డిఎల్ఆర్ 13 నోటి ఫికేషన్ జారీ, ఆర్ ఎల్ ఆర్ జారీ ,ఆన్లైన్ ప్రక్రియ 50% మాత్రమే పూర్తయిందని మిగిలిన 50 శాతాన్ని ప్రక్రియను పూర్తి చేయాల న్నారు. అదేవిధంగా రెండో దశ జిల్లా వ్యాప్తంగా 29 గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేపట్టడం జరిగిందన్నారు వీటికి కూడా అన్ని రకాల ఆన్లైన్ ప్రక్రియలు వీఆర్వో స్థాయి నుంచి నిర్వ హిస్తూ నిర్దేశిత గడువు నాటికి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. రీ సర్వే సంబంధించి నూటికి నూరు శాతం నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. రీ సర్వే ప్రక్రియపై ఐవిఆర్ఎస్ ప్రజాభిప్రాయ పోర్టల్ ద్వారా ఎటువంటి అవినీతి ఆరోపణలు ఉత్పన్నం కాకుండా సిబ్బంది జవాబుదారితనంతో అంకిత భావంతో పనిచే యాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు పీ శ్రీకర్, దేవరకొండ అఖిల, జిల్లా సర్వేన్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచా లకులు కే ప్రభాకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి. బోసుబాబు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

రాజోలు నియోజకవర్గంలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

సీనియర్ మాజీ మంత్రి గొల్లపల్లి ఆధ్వర్యంలో వైసిపి అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు V9 ప్రజా ఆయుధం దినపత్రిక – రాజోలు డిసెంబర్ 21;వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ […]

అంతర్వేది మినీ హార్బర్ అభివృద్ధి టూరిజం అభివృద్ధికై అడ్వెంచర్ బోటింగ్ యాక్టివిటీ కొరకు స్థల సేకరణ/కలెక్టర్ మహేష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -సఖినేటిపల్లి జూలై 18: అంతర్వేది మినీ హార్బర్ అభివృద్ధి, టూరిజం అభివృద్ధికై అడ్వెంచర్ బోటింగ్ యాక్టివిటీ కొరకు స్థల సేకరణ కృషి చేస్తున్నట్లు జిల్లా […]

Teaching and Staff Vacancies at Navy Children School Visakhapatnam 2025

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – విశాఖపట్నం మే30: 1.Headmistress (Primary) Age Limit: 30-50 years as on 01 Jul 25 Qualifications: Bachelor’s degree (regular […]