
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 22:

విద్యాభ్యాసంతో పాటుగా క్రీడలలోను క్రీడా స్ఫూర్తి, పోటీతత్వంతో క్రీడా ప్రతిభను చాటుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు ప్రఖ్యాతులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన స్థానిక జిఎంసి బాలయోగి స్టేడియం నందు కోన సీమ క్రీడోత్సవాలు ఆటలతో ఆరోగ్యం పేరిట జిల్లా స్థాయి విద్యార్థుల క్రీడా పోటీలు- 2025 బెలూన్లను ఎగర వేసి రన్నింగ్ క్రీడతో పోటీలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికే కాదని జీవితాల్లో ఉన్నత స్థానాలు చేరడానికి దోహదపడతా యన్నారు. యువతలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి జిల్లాస్థాయిలో యువ క్రీడాకారులు క్రీడా పోటీల్లో విజయం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లేలా క్రీడాకారులను వ్యాయామ ఉపాధ్యాయులు ప్రోత్స హించాలన్నారు.ఆటల్లో గెలుపు ఓటములు సర్వ సాధారణమని, క్రీడాస్ఫూర్తిని అలవరుచుకొని రాణించడం వల్ల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు మార్గం సుగమం అవుతుంద న్నారు.ప్రశాంత వాతావరణంలో పోటీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఈ రెండు రోజులు ఈయొక్క ఈవెంట్లలో అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటూ విజేతలుగా నిలవాలని శుభాకాంక్షలు తెలిపారు. తోలుతగా జ్యోతి ప్రజ్వలన గావించి జాతీయ పథకాన్ని ఆవిష్కరించి విద్యార్థినీ విద్యార్థుల విన్యాసాలను ఆయన తిలకించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి ని శాంతి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి ప్రత్యేక చొరవతో కోనసీమ క్రీడోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 22 మండలాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న చక్కటి వేదికను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. క్రీడలు మానసిక ఒత్తిళ్లను తగ్గించి శారీరక దారుఢ్యానికి దోహద పడతాయని, స్ఫూర్తి దాయకంగా క్రీడలలో పాల్గొ నాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా భావించి క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు.క్రీడలతో ఆరోగ్యం, మానసిక ఆనందం పొంద వచ్చునని,ప్రస్తుత యాంత్రిక జీవనవిధానంలో క్రీడల అభ్యసన చాలా అవసరమని విద్యార్థులు అభిరుచికి అనువైన క్రీడల్లో తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా ముందంజలో నిలుస్తారన్నారు, ప్రతి విద్యార్ధి విద్యతో పాటు ఆసక్తి కలిగిన క్రీడల్లో నైపుణ్యం సాధించాలని, క్రీడలతో ఆరోగ్యమే కాకుండా మానసిక ఆనందం సొంతం అవుతుందన్నారు. క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు.

శాసన మండలి సభ్యుడు కే సూర్య నారా యణరావు మాట్లాడుతూ క్రీడలను గెలుపు, ఓటములకే పరిమితం చేయొద్దని, శారీరక, మానసిక ఉల్లాసం, ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశంగా ఆటలను గుర్తిం చాలన్నారు. చిన్నతనం నుండి క్రీడల పట్ల ఆసక్తిని పెం పొందించుకొని తల్లిదండ్రులు సహకారంతో జాతీయ స్థాయిలో గుర్తింపును పొందాలన్నారు. కోనసీమ ప్రాంతం నుండి రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్ వంటి జాతీయ స్థాయి క్రీడాకారులుగా గుర్తింపు పొందడం మనకు గర్వకారణమన్నారు. అదే తరహాలో క్రీడా స్ఫూర్తిని పొంది క్రీడలలోరాణించాలని ఆయన ఆకాంక్షించారు స్థానికంగా చమురు సహజవాయువు నిక్షేపాలను వెలుగుతీస్తున్న సంస్థల సహకారంతో మరింత ఘనంగా ఈ క్రీడ ఉత్సవాలను నిర్వహించాల న్నారు ప్రపంచ స్థాయిలో చారిత్రక అమలాపురం నుండి క్రీడాకారులు పాల్గొనేలా తీర్చిదిద్దాలని క్రీడ నిర్వా హకులను కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాష మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి ఆలోచనలకు అనుగుణంగా ఈ రెండు రోజుల పాటు క్రీడా పోటీలను నిర్వహించుకోవడం సంతోష దాయకమన్నారు.

చదువుల్లోరాణించాలంటే ఎంత శ్రద్ధ అవసరమో, అంత కంటే ఎక్కువ శ్రద్ధ క్రమ శిక్షణ, క్రీడల్లో రాణించడానికి అవసరమని స్పష్టం చేశారు. ప్రస్తుత పోటీ, బిజీతో కూడిన ఆధునిక ప్రపంచంలో క్రీడల ద్వారా వచ్చే శారీరక ఆరోగ్యం పూర్తిగా తగ్గిపోయి, ప్రజానీకం బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు బారిన పడుతున్నట్లు వెల్లడించారు. గెలు పోటములకే క్రీడలను పరిమితం చేయరాదన్నారు క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అథ్లెటిక్ క్రీడ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఆరోగ్యం కోసం ఆటలు ఎంతో అవసరమన్నారు. ఆటల ద్వారా ఆరోగ్యం అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఆటలు, ఆరోగ్యం ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరికి వివరించాలని సూచించారు.ప్రజలు ఆరోగ్యంగా ఉన్న సమాజమే, అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కే మాధవి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మరియు ముఖ్య శిక్షకులు సురేష్ కుమార్ డీఎస్ఓ జీవీఎస్ సుబ్ర హ్మణ్యం, ఉప విద్యాశాఖ అధికారులు పి సూర్యప్రకాష్ వివిధ ఈవెంట్లు ఇన్చార్జిలు వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
