

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -అమలాపురం మార్చి 08 :


మానవజాతి మనుగడకు ప్రాణం పోసింది మగువని మహిళా సాధికారత తోనే స్వర్ణాంధ్ర@2047 సాధ్య పడుతుందని రాష్ట్ర వ్యవ సాయ సహకార మార్కె టింగ్ పశుసంవర్ధన పాడి పరిశ్రమ మత్స్య శాఖల మంత్రి మరియు జిల్లా ఇన్చార్జ్ మంత్రి కె. అచ్చెన్ననాయుడు పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థాయిలో అమలాపురం స్థానిక సత్యనారాయణ గార్డెన్స్ వేడుకలను మహిళలు బాలిక లందరూ హక్కులు సమానత్వం ఇతివృత్తం తో మహిళల ఆర్థిక సామాజిక పోరాటాలను జాగృతి పెంచే విధంగా ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జాతి మనుగడ కు ప్రాణం పోస్తున్న స్త్రీ లు సామాజిక ఆర్థిక రంగాలలో స్వావలంబనను సాధించా లన్నారు మహిళలు స్వతంత్రంగా ఆర్థిక పరిపుష్టి సాధించి నప్పుడే సమాజం అభి వృద్ధి చెందుతుందని తెలిపారు.

గతంలో మహిళల ప్రాధాన్యత లేదని స్వర్గీయ ఎన్టీఆర్ హయాం నుండి మహిళలకు ప్రాధాన్యత కలిగిందని నేటి ముఖ్య మంత్రి ఆధ్వర్యంలో మహిళా సంక్షేమం నూతన పోకడలతో ఎంతో పురోగతిని సాధిం చిందన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారని స్థానికంగా ఆ రోజులలో డొక్కా సీతమ్మ ఎంతో మంది దాతృత్వంతో ఆకలినీ తీర్చి ఈ ప్రాంత కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేసిందన్నారు..

అంగన్వా డీలకు గ్రాడ్యుటిని పెంచడం జరిగిందన్నారు మ హిళలు ఆత్మవిశ్వాసం తో స్వేచ్ఛ సమానత్వం కోసం సాగిస్తున్న పోరాటాలను మార్చి 8 మహిళా దినో త్సవం ఉత్తేజపరుస్తుందన్నారు ఇంటి యజమానిగా అమ్మగా అలిగా అక్కగా చెల్లిగా ఆత్మీయత పంచే మాతృ మూర్తి మహిళ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందించే దిశగా వాట్సాప్ గవర్నమెంట్ ను ప్రవేశ పెట్టిందని దీని ద్వారా సుమారు 500 రకాల సేవలు ప్రజలకు ఈ నెల చివరి నాటికి అందుబాటులోకి రాను న్నాయన్నారు జీవనగమనం లో వివిధ సమస్యల ను సహనం ఓర్పుతో ఎదు ర్కొంటున్న మహిళలలో పురుషుల కంటే మానసిక దృఢత్వం అధికమన్నారు మే మాసంలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, మహిళ పేరున విశాలమైన ఆహ్లాదకర మైన గృహాలను నిర్మించడానికి ప్రభుత్వం సంక ల్పించిందన్నారు.

ప్రభు త్వ విప్ ముమ్మిడివరం శాసన సభ్యులు సుబ్బరాజు మాట్లాడుతూ మహిళా సాధికారత అంశాలన్నింటిలో మహిళలు తమ సత్తా చాటుతున్నారన్నారు. ఏరంగంలోనైనా తాము బలహీనులమని భావన ను దరిచేరనీయ కుండా ఆత్మ విశ్వాసం ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నా రన్నారు స్థానిక శాసనస భ్యులు ఏ ఆనందరావు మాట్లాడుతూ మహిళ లేకుంటే సృష్టి జననం గమనం లేదన్నారు.

స్త్రీల హక్కుల గురించి ఆనాడే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పోరాటాలు సాగించారని తదుపరి స్వర్గీ య ఎన్టీఆర్ స్త్రీల అభ్యు న్నతికి పాటుపడ్డారని 1996 నుండి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు ద్వారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షే మానికి పెద్దపీట వేశారన్నారు మహిళలే మానవాళి ప్రగతికి ఊతమిస్తున్నారని స్త్రీ మేధాపరంగా మానసికంగా ఆధ్యాత్మికంగా పురుషులకు సమఉజ్జి అన్నారు ఎమ్మెల్సీ ఐ వీ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహిళా సాధికారత, సమాన హక్కుల సాధన కోసం సమిష్టిగా ఉద్యమించా లని హితవు పలికారు అమ్మ లందరికీ శుభాభినందనలు తెలిపారు ఎమ్మెల్సీ బి ఇజ్రా యిల్ మాట్లాడుతూ మహిళా దినోత్సవo చారిత్రాత్మక మైనదని, ప్రతి పురుషుడు విజయం వెనుక మహిళలు కీలక పాత్ర పోషించార న డంలో అతిశయోక్తి లేద న్నారు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లా డుతూ సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న సముచిత భావాలు పూర్తిగా తొలగి పోవాలన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల పట్ల మన ఆలోచన ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు మహిళలు ప్రభు త్వాలు ప్రవేశపెట్టిన ఎంఎస్ఎమ్ఈ ఇండ స్ట్రియల్ పార్క్ వంటి విధానాల ద్వారా పారి శ్రామికవేత్తలుగా ఎదుగుతూ స్థానికంగా ఉన్న కొబ్బరి ఆక్వా ఉత్పత్తులు ముడి సరుకు విలువ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుకుని పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఇందుకు ప్రభుత్వ పరంగా ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కె టింగ్ పరిశ్రమలు ఏర్పాటుకు రాయితీలతో కూడిన పెట్టుబడులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంద న్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థ నుంచే మహిళల హక్కుల పట్ల అవగాహన పెరగాల్సిందని మహిళల హక్కుల పట్ల ప్రశ్నించే తత్వం, పోరాడే తత్వాలను అలవర్చుకోవాలని సూచిం చారు. మహిళలు వారికి ఉన్న ప్రాథమిక హక్కుల పట్ల ముందుగా అవగాహన పెంచుకొని వాటి సాధనకు ముందుకు రావాలన్నారు. సమాజ నిర్మాణంలో సగభాగ మైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలమని ఇదే నినాదంతో ఐక్యరాజ్యసమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ఏటా నిర్వహిస్తోందన్నారు.

సమాజంలో మహిళలు ఆత్మ గౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకొని నిరంతర జీవ నాధార అవకాశాలు తామే స్వయంగా నిర్మించు కోని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు.విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంత రిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తు న్నారన్నారు మానవ వనరుల సంపూర్ణ విని యోగంలో వీరి పాత్ర కూడా ఎంతో ఉందని, ఏ రంగం లోనై నా ఉన్నత శిఖరాలను చేరు కుని పురుష శక్తికీ తామే మీ తీసిపోమని చాటి చెబుతున్నారన్నారు.

మహిళలు ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజ యాలు సాధిస్తున్నార న్నారు. ప్రతి మగాడి విజయంలో స్త్రీ పాత్ర లేనిదే అతడికి మను గడే లేదని ఆమె స్పష్టం చేశా రు. మహిళా సాధికారత అనేది నాణ్యమైన జీవితానికి దారితీసే అన్ని రంగాల నిర్ణయాత్మక ప్రక్రియలో మహిళల భాగస్వామ్య శక్తిని సూచిస్తుందన్నారు. మహిళా సాధికారత అన్నది వారి ఆలోచనలు, హక్కులు, నిర్ణయాలు, చర్యల యొక్క అన్ని అంశాలలో స్త్రీలను స్వతంత్రంగా మార్చే ప్రక్రియన్నారు మహిళా సాధికారత సమాజంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుం దన్నారు.కుటుంబం, సమా జం అభివృద్ధి చెందడానికి మహిళా సాధికారత అవసరమని భారత రాజ్యాంగం ప్రకారం సమా నత్వ హక్కుచట్టం భారత దేశంలోని మహిళ లకు సాధికారత కల్పించ డం లో సహాయపడుతుందన్నారు.

మహిళ సాధికారత అన్నది మహిళలకు ఉపాధి, విద్య , ఆర్థికాభివృద్ధికి సమాన అవ కాశాలను కల్పిస్తుందన్నా రు. విద్యా వంతులైన స్త్రీలు జీవితం లో చక్కటి అవ గాహనతో నిర్ణయాలు తీసుకో గలుగుతారని, మహిళలకు సాధికారత కల్పించడం లో విద్య ప్రధాన పాత్ర పోషిస్తుంద న్నారు భారత ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో’ ఉజ్వల పథకంమహిళా శక్తి కేంద్రాలు వంటి మహిళలకు సాధికారత కల్పిం చే వివిధ పథకాలను ప్రారంభించి మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధ నల ఉత్సవంగా అంతర్జాతీ య మహిళా దినోత్సవం నిర్వహించుకుంటున్నారని తెలిపారు. మహిళల రాజకీయ, సామాజిక హక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా ఈ దినోత్స వాన్ని నిర్వ హించుకోవడం జరిగిందన్నారు. సమాజ అభివృద్ధిలో పురుషుల తో పాటు సమానంగా మహిళలు కూడా సహాయపడుతున్నారన్నారు ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్స హించడానికి, వారి హక్కు ల గురించి మహి ళలకు అవగాహన కల్పిం చడానికి అంతర్జాతీయ మహి ళా దినోత్సవo దోహధపడు తోందన్నారు. ఆర్డీవో కే మాధవి మాట్లాడుతూ మహిళలు తల్లిగా భార్యగా కుటుం బం ఉన్నత స్థితికి చేరుకోవడంలో ఎంతో తోడ్పాటు అందించారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. సమాజంలో ఉన్నత శిఖ రాలను అందుకుంటున్న వారిలో మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నారని గుర్తు చేశారు.

మగవారి కంటే మహిళలు శారీరకంగా మానసికంగా ఎంతో దృఢ త్వాన్ని కలిగి ఉంటారని ఆమె స్పష్టం చేశారు డి ఆర్ డి ఏ ద్వారా 650 గ్రూపులకు బ్యాంకు లింకేజీ స్త్రీ నిధి కింద రూ 130 కోట్లు రుణాలు, ఏడు మండల మహిళా సమైక్యలకు సిఐఎఫ్ నిధి కింద రూ 1.05 కోట్లు, పీఎం అజయ్ పథకం ద్వారా 83 మంది లబ్ధి దారులకు రూ 1.40 కోట్లు, మెప్మా ద్వారా 81 గ్రూపులకు రూ 7.03 కోట్లు, విశ్వకర్మ యోజన ద్వారా 80 మంది లబ్ధి దారులకు రూ 80 లక్షలు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా 10 మంది లబ్ధిదారులకు రూ 3.88 కోట్లు, కుట్టు శిక్షణ కార్య క్రమానికి గాను 3,2 43 మంది లబ్ధిదారులకు రూ. 8.11 కోట్లు, చేనేత ముద్ర రుణాలు 28 మంది లబ్ధిదారులకు రూ 14 లక్షలు, 60 మంది లబ్ధిదారులకు ముద్ర స్టాండప్ రుణాలు రూ 3 కోట్లు మేర ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు.విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులు, ఏడాదికి లక్ష రూపాయలు ఆదాయం గడుస్తున్న పారిశ్రామిక వేత్తలను వివిధ రంగా లలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మహిళా అధికారులకు ప్రశంసా పత్రం మెమొంటో తో సత్కరించారు.

చివరిగా వివిధ శాఖలు తమ తమ అభివృద్ధి కార్యక్ర మాలకు అద్దం పట్టే విధంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రులు అధికారులు పరిశీలించారు. ఈ కార్య క్రమంలో జిల్లా ఎస్పీ బీ కృష్ణారావు, ఎమ్మెల్సీ కె సూర్యనారాయణ రావు, కొత్తపేట ఎమ్మెల్యే బి సత్యానందరావు,అమూడ చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, మెట్ల రమణ బాబు డిఆర్ఓ రాజకుమారి ఐసిడిఎస్ పిడి శాంతి కుమారి డిఆర్డిఏ పిడి శివశంకర్ ప్రసాద్ పరిశ్రమల కేంద్రం జిఎం పీకే పీ ప్రసాద్ వివిధ శాఖలకు చెందిన అధికారులు వికాస మేనేజర్ జి రమేష్ సిడిపిఓలు మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

