
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జూలై 03:

నియోజకవర్గ పరిశీలకులు గా ఒంటెద్దు వెంకయ్య నాయుడు ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి వెల్లడించారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు ఏడుగురు పరిశీలకులను నియమించినట్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. పార్టీ సమావేశంలో చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ..ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక పరిశీలకులను నియమించి వారి విధివిధానాలను క్లుప్తంగా తెలియజేసినట్లు నియామకాలు ఈ విధంగా ఉన్నాయి.మండపేట నియోజకవర్గానికి పరిశీలకులుగా కటకంశెట్టి ఆదిత్య, రామచంద్రపురం నియోజకవర్గానికి పరిశీలకులుగా కుడిపూడి శ్రీనివాసరావు, ముమ్మిడివరం నియోజకవర్గానికి పరిశీలకులుగా మాత మురళి, అమలాపురం నియోజకవర్గం పరిశీలకులుగా పేరి శ్రీనివాస కామేశ్వరరావు, పి గన్నవరం నియోజకవర్గానికి పరిశీలకులుగా పెన్మత్స చిన్న భద్ర రాజు, రాజోలు నియోజకవర్గానికి పరిశీలకులుగా వంటేద్దు వెంకన్న నాయుడు , కొత్తపేట నియోజకవర్గానికి పరిశీలకులుగా సిరిపురపు శ్రీనివాసరావులను నియమించడం జరిగిందిని ఆయన మీడియాకు తెలిపారు.
