
రాజోలు నియోజకవర్గం సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ హరీష్ బాలయోగి,ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్…

సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంతో ప్రజలతో మరింత మమేకం అవుతామని తెలుగుదేశం పార్లమెంటరీ విప్,అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి అన్నారు.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సారథ్యం,తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆదేశాల మేరకు రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం వివి మెరక గ్రామంలో సత్యనారాయణరాజు ఫంక్షన్ హాలులో జరిగిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమ.

శిక్షణా తరగతులకు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తో కలిసి హరీష్ హాజరయ్యారు. మొదట ఇటీవల మరణించిన రాజోలు ఎంపీపీ కేతా శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కాసేపు మౌనాన్ని పాటించి సంతాపం తెలియజేశారు. అనంతరం నియోజకవర్గ శిక్షణా తరగతుల ఇంచార్జ్ ప్రకాష్ శిక్షణ ఇచ్చిన అనంతరం హరీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. బూత్,క్లస్టర్,యూనిట్ ఇంచార్జులు ఈ కార్యక్రమానికి సంబంధించిన యాప్ ద్వారా ప్రజల వద్దకు వెళ్లి యాప్ చూపించిన విధంగా ప్రజల సమస్యలు గానీ,సలహాలు గానీ యాప్ లో పొందుపరచాలని సూచించారు.ప్రజా సమస్యల పరిష్కారానికి,ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో కార్యకర్తలు వారధులుగా పని చేయాలని కోరారు.

వివి మెరక,మోరిపాడు గ్రామాలలో ఇంటింటికీ తిరిగిన ఎంపీ హరీష్,ఎమ్మెల్సీ రాజశేఖర్….

శిక్షణా తరగతుల అనంతరం గ్రామంలోని వీవర్స్ కాలనీలో ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్సీ రాజశేఖరం ఇంటింటికీ తిరిగి కరపత్రాలను అందజేశారు.సూపర్ సిక్స్ హామీల అమలు చేసుకుంటూ సంవత్సర కాలం పూర్తి చేసుకుని ప్రజల వద్దకు వచ్చామని హామీల అమలు,పరిపాలనలో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నామని తెలిపారు.ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకం అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంతో అందరూ హర్షం వ్యక్తంచేస్తున్నారన్నారు.యాప్ లో నమోదు చేసిన ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలు ఇచ్చే సలహాలను కూడా స్వీకరిస్తామని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.