

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 08:

అయినవిల్లి మండల వైసీపీ నూతన అధ్యక్షుడు రాకతో పార్టీ జవసత్వాలు అందుకున్నాయని ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్తగా గన్నవరపు శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. స్థానిక పార్టీ సంస్థాగత ఎన్నికలు నేపథ్యంలో అయినవిల్లి మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా కే జగన్నాధపురం గ్రామ సర్పంచ్ మేడిశెట్టి శ్రీనివాస్ నియమితులైనట్లు స్థానిక జిల్లా అధ్యక్షులు చిర్లజగ్గి రెడ్డి ఆయన పేరును ప్రకటించారు.మొదటలో ఆశావాహులు చిన్నబుచ్చుకున్నపట్టికి అధిష్టానం రంగ ప్రవేశంతో విభేదాలు విడిచి స్నేహ భావాలు తో ఒకటయ్యారు.

ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా అందరూ కలిసి జయంతి వేడుకలను నియోజకవర్గ సమన్వయకర్త గన్నవరపు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం నూతన అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాసకు అభినందనలు వెళ్లి వెతుతున్నాయి. మండల గ్రామ నలుమూలలా నుండి శ్రీనివాస్ స్వగ్రాహానికి పెద్ద ఎత్తున వచ్చి శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్కడతో విభేదాలు తొలగి పార్టీకి జవసత్వాలు మేడిశెట్టి తీసుకొస్తారని పార్టీ శ్రేణులు ఆశాభావాలు వ్యక్తపరిస్తున్నారు.