

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూలై 02:

మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

ఆయన తల్లి సరోజినీ (70) శుక్రవారం మధ్యాహ్నం స్వగ్రామం ఏలూరు జిల్లా మార్టేరు లో మృతిచెందారు.అనారోగ్యం కారణంగా సరోజినీ కన్నుమూశారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా మార్టేరులో శనివారం అంత్యక్రియలు పూర్తి చేసారు.శివాజీ తండ్రి కారెం మోహన్ రావు గొప్ప దళిత నాయకులు గా పేరు గాయించారు.
ఆయన అనేక దళిత పాటలతో పాటు అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాలు రచించి కంజర కథలుగా మలిసి అనేక మందిని సైతన్యం పరిచేవారు. మోహన్ రావు అనారోగ్యం కారణం వల్ల మరణించారు.తండ్రి ఉద్యమ నాయకుడు కావడంతో ఆ కోవలోనే డా” దళిత రత్నం కారెం శివాజీ ఉద్యమ నాయకులుగా తెలుగు రాష్ట్రాలకు పరిచయమయ్యారు.
విషాదంలో ఉన్న కారెం శివాజీ కుమారుడు డాక్టర్ రవితేజ ను V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ బుదవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాగం గ్రామం ఆయన నివాసగృహం లో పరామర్శించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటూ.. శీవాజీ కన్నీరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులను ప్రేమించడం గౌరవించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. శివాజీ శిష్యుడిగా ఆయన వద్ద అయినవిల్లి మండలం ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ అధ్యక్షులు పనిచేసిన ఉద్యమ నాయకులు గా వినయ్ కుమార్ కు మంచి గుర్తింపు ఉంది.

ఈ కార్యక్రమంలో జాతీయ మాలమహానాడు కార్యదర్శి కొంకి వెంకట్రావు, కొండ్రు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.