ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోవటానికే ప్రజా వేదిక

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 08;

అర్జీల పరిష్కారంలో నూటి కి నూరు శాతం నాణ్యతతో పాటు పూర్తి స్పష్టత ఉండాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారు లను ఆదేశించారు. సోమ వారం స్థానిక కలెక్టరేట్ గోదావరి భవన్ నందు జిల్లా స్థాయి ప్రజా ఫిర్యా దులు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ప్రజా సమస్య పరిష్కారంలో స్పష్టత తప్పని సరని ఆర్జీలు పునరా వృతమైతే జిల్లా అధికారులు భాధ్యత వహించాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదే శించారు ప్రజలకు అత్యంత చేరువగా సుపరిపాలనను అందించాలని వివిధ స్థాయిలలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లను ఏర్పాటు చేసిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ఆధిక ప్రాధాన్యతను ఇస్తుందని ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలకు పరిష్కరం చూపడంలో జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉంద న్నారు.

ఆర్జీల పరిష్కారంలో స్పష్టత ఉన్నప్పుడే పరిష్కారం అవుతాయని, లేదంటే సమస్య పునరావృతమవుతూనే ఉంటుందన్నారు. ఆర్జీల పునరావృతం భాధ్యత జిల్లా అధికారులదే నన్నారు. పిజిఆర్ఎస్ పై ప్రజల పెట్టుకున్న నమ్మ కానికి మరింత బలం చేకూర్చేలా అధికారుల పనితీరు ఉండాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కా రంపై అధికారులు దృష్టిపెట్టి నిర్దేశ గడువులోగా పరిష్క రించాలని సూచించారు. అర్జీల పరిష్కార వ్యవస్థ పటిష్ట పర్యవేక్షణకు, అర్జీ స్వీకరించింది మొదలు అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించే వరకు ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబు దారీతనానికి ప్రాధా న్యమిచ్చేలా, ఆర్జీలు పరిష్కరిం చాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిశాంతి మాట్లాడుతూ అర్జీలు పరిష్కారoలో పారదర్శకత, నాణ్యత ఉండాలనీ ప్రజా సమస్యలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అధికారులు వారి వారి శాఖలకు సంబంధిం చిన ఆర్జీలను క్షణంగా పరిశీ లించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని సం దర్భాల్లో ఫిర్యాదులు పరి ష్కారానికి కొంత సమయం అవసరం ఉన్నప్పుడు సంబం ధిత విషయాన్ని ఫిర్యాదు దారులతో అధికారులు మా ట్లాడితే వారికి కొంత ఊరట కలుగుతుండన్నారు. ఫిర్యా దులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖకు ఎండార్స్మెంట్ చేసి పంపాలని, కాలయాపన చేస్తే ఫిర్యాదుదారులు అసంతృప్తి చెందుతారని ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.మొత్తం 200 అర్జీలు స్వీకరిం చడం జరిగిందన్నారు కార్యక్ర మంలో డిఆర్వో కే మాధవి, డ్వామా పిడి ఎస్ మధుసూదన్, ఎస్ డి సి పి కృష్ణమూర్తి, డి ఎల్ డి వో రాజేశ్వరరావు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Related Articles

బాణాసంచా తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలు పై అధికారులు ఉక్కు పాదం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 9: బాణాసంచా తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలు నిర్వహించే వారు ప్రజల భద్రత, పర్యావరణ పరి రక్షణ, చట్టపరమైన ప్రమాణాలు తప్పనిసరిగా […]

సోషల్ మీడియాపై కఠినమైన చర్యలు:డిఎస్పి మురళీమోహన్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు రాజోలు ఫిబ్రవరి 20: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తప్పవని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట […]

రాజ్యాంగం అంటే స్వేచ్ఛా భారతం: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 26: స్వేచ్ఛా భారతంలోని ప్రతి పౌరునికి స్వేచ్ఛా యుతమైన జీవనాన్ని వ్వాలన్న సంకల్పంతో రాజ్యాంగ రచన జరి గిందని జిల్లా కలెక్టర్ […]

విజయవాడలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ లాంఛనంగా శనివారం ప్రారంభించారు.విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ తదుపరి […]