


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం జూలై 13:

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మరియు ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్,ముమ్మిడివరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు గారితో కలిసి ఎంపీ హరీష్ బాలయోగి పాల్గొన్నారు.

19 వ వార్డులో ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమాన్ని అభివృద్ధిని వివరించారు.

అలాగే కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చే సూచనలను,సలహాలను స్వీకరించడం జరిగింది.అలాగే రామచంద్రాపురం నియోజకవర్గం పామర్రు,యండగండి గ్రామాలలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ హరీష్ బాలయోగి పాల్గొన్నారు.