

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ O8:

జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలలో పరిశ్రమల అభివృద్ధికి ఎగుమతుల పెంపుదల కోసం ఆవశ్యకమైన అనుమతులు, రాయితీల ద్వారా ఔత్సాహిక పారిశ్రామి కవేత్తలను ప్రోత్సహించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ లైన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు 16 వ “జిల్లా పరిశ్రమలు ఎగుమ తుల ప్రోత్సాహక మండలి “సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మ సింగిల్ విండో (ఏక గవాక్ష) విధానం ద్వా రా అనుమ తుల మంజూరు పై క్షుణ్ణం గా సమీక్షించి అను మతులు మంజూరును వేగవంతం చేయాల న్నారు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 59 యూనిట్లకు ఆమోదం తెలిపారు జిల్లాలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ వంటి మేజర్ ప్రాజె క్టులు ఏర్పాటుకై చర్యలు చేపట్టాలన్నారు. ఎం ఎస్ ఎం ఈ కింద క్లస్టర్ డెవల ప్మెంట్ పథకం ద్వారా వ్యవసాయ అనుబంధ విలువ ఆధారిత యూనిట్లు తీసుకురావాలన్నారు.

ఉదయం వర్క్ షాప్ లు సమర్థవంతంగా నిర్వ హించి యూనిట్లు నిర్వ హిస్తున్న నిర్వహించడానికి ముందుకు వస్తున్న వారిని అన్ని విధాలా ప్రోత్సహించా లన్నారు. వాట్సాప్ గవర్నె న్స్ మనమిత్ర వంటి యాప్ ల ద్వారా ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవుట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ అగ్రి బేసిడ్ యూనిట్లు స్థాపనకు సంకల్పించాలన్నారు. క్వాయర్ పరిశ్రమల స్థాపనకు మూడు రాష్ట్రాలలో ఎక్స్పోజర్ విజిట్లు నిర్వహించి డిపిఆర్లు రూపొందించాలని ఆదేశించారు మామిడికుదు రులో క్లస్టర్ అభివృద్ధికి జియో టెక్స్టైల్ మ్యాట్లు తయారీకి ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు డిపిఆర్లు కోపకల్పన చేయాలన్నారు కోకో గింజలు నాణ్యత కొరకు హార్వెస్టింగ్ విధానంపై ప్రాజెక్టు రూపొందించాల న్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం అమలుపై మూడు అంశాలతో వెండార్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహణకు అన్ని అంశాలపై అధ్యయనం చేస్తూ స్టాల్స్ ఏర్పాటుకు జిల్లా స్థాయిలో ఒక స్థలా న్ని ఎంపిక చేయాలన్నారు అవసరమైన అనుమతులు ఇస్తూ, దరఖాస్తుల ప్రణాళిక ను త్వరితగతిన పూర్తి చే యాల న్నారు. పీఎం విశ్వకర్మ యువజన ద్వారా కులవృ త్తులను అన్ని విధాల అవ గాహన కల్పిస్తూ ప్రోత్సహించాలన్నారు.పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా యువ తకు పథకాల లబ్ధిదారుల కు ప్రోత్సాహక మార్గదర్శ నం చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఉత్పత్తి, ఎగుమతుల లక్ష్యాదుల సాధన కోసం పాటుపడాలన్నారు.
పరిశ్రమల మంజూరులో జాప్యాలను నివారించాల న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ అరుణ, ఏడి శివరాం ప్రసాద్ డిఆర్డిఏ పిడి గాంధీ, సిడ్బి ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్ మత్స్యశాఖ అధికారి శ్రీని వాసరావు, డ్వామా పిడి మధుసూదన్, వివిధ శాఖ ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.