

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 26:

ప్రజలు మత్తు పదార్థాల కు అలవాటు పడ్డారంటే ఆ సమాజం తిరోగమనం లో పయనిస్తోందని ఆ లాంటి చోట సామాజిక, మానసిక, శారీరక అనా రోగ్యాలు తలెత్తి భవి ష్యత్తును కుంగదీసే ప్రమాదం ఉందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్ట ర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు.

గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు, ఆక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరిం చుకొని డ్రగ్ రహిత ఆంధ్ర ప్రదేశ్ మన లక్ష్యం అనే నినాదంతో “మాదకద్ర వ్యాలకు దూరంగా ఉండి ప్రాణాలను కాపాడుకుం దాం “అనే ఇతివృత్తంతో సత్తె మ్మ తల్లి గుడి ఎత్తు రోడ్డు నుండి పేరూరు జంక్షన్ వరకు విద్యార్థిని విద్యార్థులతో మాదక ద్రవ్యాల పై అవ గాహన ర్యాలీని నిర్వహిం చారు ఈ సందర్భంగా ర్యాలీని ప్రారంభించి సభలో ప్రసంగిస్తూ మాదక ద్రవ్య రహిత సమాజాన్ని సాధించేందుకు అన్ని వర్గాల ప్రజలను భాగ స్వాములను చేస్తూ అవగాహనను పెంపొం దించాలని పిలుపునిచ్చారు.

మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును ఛిద్రమయ్యేలా చేస్తున్నా యని, అభం శుభం తెలియని విద్యార్థులు చిన్న వయస్సులోనే డ్రగ్స్కు బానిసలవుతు న్నారన్నారు. ప్రమాదకర వ్యసనాలపై యువత అవగాహన కలిగి ఉండా లని సూచించారు. సమా జంలో మాదక ద్రవ్యాల ను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవ హరించి, డ్రగ్స్ వినియోగాన్ని నిరోధించ డంలో భాగస్వా ములు కావాలన్నారు యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉన్నత విద్య ను అభ్యసించాలని విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్ను నాశనం చేసు కోరాదన్నారు.

విద్యాసంస్థలు ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ వాడకం, విక్రయిస్తున్నట్లు సమాచారం తమకు అందిస్తే చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచు తామ న్నారు. యువత మత్తుకు బానిసై వారి ఉజ్వల భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారని, ప్రతి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

మాదకద్రవ్యాలు వద్దు. ఆరోగ్యం ముద్దు అంటూ మాదక ద్రవ్యాల విని యోగంతో చేకూరే అన ర్దాలను తెలియజే యాలనే ఉద్దేశ్యంతో ఈ దినో త్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ను నివారించడం ద్వారా విని యోగాన్ని తగ్గించ వచ్చనన్నారు మత్తులో జోగడం ప్రపంచానికి పెనువిపత్తేనని అందు లోనూ శక్తివంతమైన యువత ఈ మత్తు ప్రపంచంలో జోగు తుంటే నష్టమేనని అందుకే మత్తు వదలా లన్నారు డ్రగ్స్ ఒకసారి శరీరంలోకి ఎంటరయ్యాక వారికి కనపడేది మత్తు ప్రపంచ మేనని బడి పిల్లలకు సైతం డ్రగ్స్ చాక్లెట్స్ రూపంలో చేరువ చేస్తున్న దారుణమైన స్థితిలో నేడు మనము ఉన్నామన్నారు.

పసితనం ఈ మత్తు పదార్థాలతో వసివాడి పోతోందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడటం సమాజానికి చాలా నష్టం కలిగిస్తుందన్నారు.నిత్యం ఏదో ఒక చోట పెద్దయెత్తు న మత్తుపదార్థాలు పట్టు బడటం పరిపాటిగా మారిందనీ. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం ఒకప్పుడు పట్టణాలు, నగరాలకే పరిమితమైన మత్తు పదార్థాల జాడ్యం ప్రస్తుతం గ్రామీణ ప్రాం తాలకూ పాకిందన్నారు.

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినో త్సవాన్ని పురస్కరిం చుకుని యువతను ఉద్దేశించి డ్రగ్స్ బారిన పడమని తమకు మాట ఇవ్వాలని విద్యార్థినీ విద్యార్థులచే ఆర్డిఓ కే మాధవి ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడు తూ మత్తు పదార్థాలు రకర కాల రూపంలో కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు చేరుతు న్నాయన్నారు. దూమ పానం, మద్య పానంతో సరదాగా మొదలయ్యే అలవాటు క్రమంగా మాదకద్రవ్యాల దాకా విస్తరి స్తోందన్నారు. మాదకద్రవ్యాల పల్ల కలిగే నష్టంపై ప్రజల్లో అవగాహన పెం చాలని 1987లో ఐక్యరా జ్యసమితి సాధారణ సభ తీర్మానిం చిందన్నారు. ఈ క్రమంలో ఏటా జూన్ 26 ను మాదకద్రవ్యాల వ్యతి రేక దినోత్సవంగా నిర్వహి స్తున్నారన్నారు.

మత్తుప దార్థాలకు అలవాటు పడినవారు గంజాయిని వివిధ రూపాల్లో వినియో గిస్తూ అలవాటు పడ్డార న్నారు. ఎక్సైజ్ సూపరిం టెండెంట్ ఎస్ కే డి వి ప్రసాద్ మాట్లాడుతూ సిరంజీల ద్వారా మత్తు మందులు తీసుకునే క్రమంలో హెచ్ఐవీ బారిన పడే ప్రమాదంఉంద న్నారు మద్యానికి బానిసలై ఎంతో మంది తీవ్ర అనా రోగ్యాల వారిన పడుతు న్నారనీ. మద్యం, డ్రగ్స్ మత్తులో తీవ్రమైన నేరాలకుపాల్పడుతున్నా రన్నారు. స్థానిక డిఎస్పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ మాట్లా డుతూ కొంత మంది మత్తు పదార్థాలు లేనిదే తమ దైనందిన చర్యలు చేయలేక పోతున్నార న్నారు.

ప్రస్తుతం పాన్ షాపు లు, కిరాణా దుకాణాల్లోనూ మాదకద్ర వ్యాలు యథేచ్చగా ఆమ్మే దుస్ధితి నెలకొంద న్నారు. గంజా యిలో ఉండే రసాయనం వ్యక్తులను దానికి బానిస లుగా మారుస్తుందనీ అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపి శ్రద్ధ ఏకాగ్రత జ్ఞాపకశ క్తిని దెబ్బతీసి చురుకుదనం సన్నగి ల్లుతుందన్నారు. గంజాయి సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమా దాలు సంభవి స్తాయన్నారు మత్తుపదార్థాల మహా విధ్వంసాన్ని నిరోదిం చాలంటే తయారీ దారులు, రవాణా చేస్తున్న వారికి కఠిన శిక్షలు పడేలాచూడాల న్నారు. ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాల వల్ల తలెత్తే నష్టాలపై సామాజిక, ప్రసార మాధ్యమాలు, విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.

మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మానసిక వైద్యుల వద్దకు తీసుకుని వెళ్లి నిపుణులైన వైద్యులు సరైన చికిత్స అందిస్తే ఆ జాడ్యం నుంచి బయట పడే అవకాశం ఉంద న్నారు. పొగాకు ఉత్పత్తు ల్ని మానడానికి, ఆల్క హాల్ ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడటానికి ఆధు నాతన చికిత్సలు అందు బాబులోకి వచ్చాయన్నా రు.యువత మాదకద్ర వ్యాలకు బానిసైతే నైతిక విలువలు దిగజారిపోవ డం ఖాయమని తద్వారా ఆయా కుటుంబాలు రో డ్డునపడే పరిస్థితి వస్తుం దన్నారు.. ఈ కార్యక్ర మంలో డీఈవో షేక్ సలీం భాష డిఎం అండ్ హెచ్ ఓ దుర్గారావు దొర, ఐసిడి ఎస్ పిడి శాంతి కుమారి, వికాసా జిల్లా మేనేజర్ జి రమేష్ తదితరులు పాల్గొన్నారు.