
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 11:
మస్కట్ దేశంలో చిత్ర హింసలు పడుతున్న నా భార్యను ఇండియాకు రప్పించాలని కొత్తపేట గ్రామానికి చెందిన సాక చంటి స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో గల కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ నందు ఫిర్యాదు చేయగా తక్షణమే స్పందించి నటువంటి కేసీఎం సిబ్బందిజిల్లా కలెక్టర్ ఆదేశాలతో సాక మరియమ్మను ఇండియాకు రప్పించడం జరి గిందని డిఆర్ఓ మరియు కేంద్రం నోడల్ అధికారి కొత్త మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాక చంటి తన ఇద్దరు బిడ్డల చదువులకు ఆర్థిక స్థోమ త లేని కారణంగా తన భార్యను విదేశాలకు పంపి తన బిడ్డలను బాగా చది వించుకోవా లనుకున్నాడనీ అయితే కోటిప ల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పరిచయ lమై కొంత సొమ్ము ఇచ్చి నీ భార్యను నేను విదేశా లకు పంపిస్తాననీ నమ్మబలికి 2025 జూన్ మూడో తేదీన హైదరాబాదు నుండి మస్కట్ దేశానికి విమానం ఎక్కించాడ న్నారు .మస్కట్ దేశంలో మొదటి ఒక ఇంట్లో తర్వాత మరల వేరోక ఇంటిలోకి పనికి మార్చారనీ ఆ ఇంటి నందు సరైన భోజన వసతి లేకపోవడం శారీరకంగా మానసికంగా ఇబ్బం దులకు గురి చేస్తూ సాక మరి యమ్మను పనిచేయించే వారనీ ఫోన్ కూడా అందుబాటులో ఉంచేవారు కాదని తన భర్త వాపోయాడనీ తన ఆరోగ్యం క్షీణిస్తుందని అక్కడ ఉంటే అక్కడే చనిపోయే అవకాశం ఉందని నా భార్య అయిన సాక మరియమ్మను ఇండియాకు క్షేమంగా తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వారికి కేసీఎం సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయడమైనదన్నారు ఫిర్యాదు అందుకున్న కేసీఎం సెంటర్ సిబ్బంది వెంటనే స్పందించిమస్కట్ దేశానికి పంపిన ఏజెంట్ను పిలిపించి కోన సీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ నందు ఇరుపక్షాల వారిని కూ ర్చోబెట్టి సంప్రదింపులు జరిపి వెంటనే సాక మరియమ్మను ఇండియాకు తీసుకురావడం జరిగిందని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రే షన్ డిఆర్వో కే సి ఎం నోడల్ అధికారి కొత్త మాధవి మరియు సమన్వయ అధికారి జి రమేష్ లు తెలియచేశారు.