

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -సూర్యపేట జూన్ 26:

సూర్యపేట కోదాడ సమీపంలోని ఘోర ప్రమాదం ప్రమాదంలో మరణించిన ఎస్సై కానిస్టేబుల్ పట్ల రాష్ట్ర పోలీస్ శాఖ దిగ్బ్రాంతి చెందింది.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై ఎం. అశోక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గంజాయి కేసుకు సంబంధించి నిందితుల కోసం కానిస్టేబుల్స్ తో కలిసి కారులో హైదరాబాద్ వెళ్తుండగా కోదాడ వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.ఎస్ఐ అశోక్ తో పాటు కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరియు కారులో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి హెడ్ కానిస్టేబుల్ ,డ్రైవర్ రమేష్ లకు గాయాలు తో కోదాడ ప్రభుత్వ దువాఖానానందు చికిత్స పొందుతున్నారు . ఈ దురదృష్టకరమైన సంఘటన పై ఏపీ పోలీస్ శాఖ దిగ్బ్రాంతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.