
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- శ్రీకాకుళం బారువ 09:

ప్రభుత్వ డిగ్రీ కళాశాల బారువ లో చేపట్టిన సంక్రాంతి సంబరాలు అందరిని ఆకట్టుకున్నాయి అంటూ ఉపాధ్యాయులను ప్రజా ప్రతినిధులు అభినందించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.డి.రామారావు మరియు వైస్ ప్రిన్సిపాల్ పి.రామకృష్ణ అద్వర్వం లో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ పి.స్నేహాలత పర్యవేక్షణలో విద్యార్థులు గురువారం సంక్రాంతి సంబరాల్లో భాగంగా వివిధ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.కళాశాల ఆవరణలో లో భోగి మంటలు వేసి, నృత్యాలుతో సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోస్టర్ ప్రెజెంటేషన్,రంగోలి, మెహందీ పోటీల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణ లో ఆకట్టుకున్నారు.

ప్రిన్సిపాల్ మరియు విద్యార్థులు,స్టాఫ్ కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసి కోఆర్డినేటర్ బడ్డ.రాంబాబు, కె.హేమసుందర్, ఎస్.వెంకట అప్పారావు,జి. రాజేంద్రప్రసాద్,టి. నీలకంఠం,టి.రాజేంద్ర ప్రసాద్,జి.శంకరరావుపి.సౌశీల్య,బి.జగదీశ్వరి,పి.డి.కె.రామారావు,అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

