క్షయ వ్యాధి రహిత సమాజమే లక్ష్యం: రాజ కుమారి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 17:

క్షయ వ్యాధి రహిత సమాజమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పని చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వీఆర్వో బిఎల్ఎన్ రాజ కుమారి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు క్షయ వ్యాధి నివారణ కళంకం అంశాల పట్ల అవగాహన సదస్సును నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ క్షయ వ్యాధి నిర్మూల న పట్ల పూర్తిగా అవగాహనను పెంపొం దించుకొని జాగ్రత్తలు మెలకువలు పాటించాలని సూచించారు క్షయవ్యాధి కి కారణ మైన బాక్టీరియాను 18 82లో కనుగొన్నారన్నా రు ప్రజల్లో క్షయ నివారణ అపోహలు కలంకాలపై అవగాహన కల్పించాల్సి న బాధ్యత అందరిపై ఉందన్నారు. పోషకాహార లోపం, వ్యాధి నివారణ శక్తి లోపం కారణంగా టీబీ వ్యాధి వ్యాప్తి జరుగు తుందన్నారు.

క్షయ వ్యా ధి లక్షణాలైన దగ్గు, రెండు వారాల పాటు జ్వరం, బరువు తగ్గడం, నోటి నుంచి రక్తం కారడం వంటి జరిగితే తక్షణం వైద్య పరీక్షలు చేయించు కోవాలన్నారు. ఆరు నెల ల పాటు మందులు వాడటం వల్ల వ్యాధిని పూర్తిగా నియంత్రించవ చ్చునన్నారు క్షయ వ్యాధి నివారణ రెండు వారాల పాటు దగ్గు, సాయంత్రం జ్వరం, ఆకలి తగ్గటం, బరువు తగ్గటం వంటివి క్షయ వ్యాధిగా గుర్తించాలని తెలిపారు.

అనుమా నిత రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, రోగ నిర్థారణ అయిన తరు వాత పూర్తి వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. క్షయ వ్యాధి గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని, వ్యాధి నివారణకు ఆరోగ్య కేంద్రంలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కోనసీమ జిల్లా శాఖ ఐఎంఏ వైద్యులు డ డాక్టర్ జె ఎస్ శివకుమార్ మాట్లాడుతూ క్షయ రహిత సమాజానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.క్షయ అంటువ్యాధని ఇది గాలి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుందన్నారు.

మైక్రో బ్యాక్టీరియ ట్యూ బెర్క్యులసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా సోకుతుందన్నారు. ముఖ్యంగా ఊపిరి తిత్తులకు ప్రభావం చూపుతుందన్నారు. సకాలంలో క్షయకు చికిత్స పొందాలని, లేదంటే మందులకు కూడా లొంగని మొండి వ్యాధిగా మారుతుంద న్నారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో టీబీ కేంద్రంలో సంప్రదిం చాలన్నారు. సకాలంలో చికిత్స చేసుకుంటే దీనిని పూర్తిగా నివారించవచ్చు నన్నారు. క్షయ వ్యాధి గ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తార న్నారు క్షయ వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా నయం చేయవచ్చని క్షయ వ్యాధి నియంత్రణ అధికారి భరత లక్ష్మి తెలిపారు.

క్షయ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవ గాహన కలిగి ఉండాల న్నారు. టీబీ బ్యాక్టీరియా సాధారణంగా దగ్గు, తుమ్ముల సమయంలో గాల్లోకి విడుదలయ్యే చిన్న బిందువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందన్నారు. టీబీ వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గిన ప్పుడు, మాట్లాడినప్పు డు, తుమ్మినప్పుడు పాడినప్పుడు, నవ్విన ప్పుడు, వారు టీబీ ని వ్యాప్తి చేస్తారని. తద్వారా బరువు తగ్గడం, నిరంతర దగ్గు, రాత్రిపూట చెమ టలు పట్టడం విపరీత మైన జ్వరం ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించా లన్నారు డాక్టర్ పిఎస్ శర్మ మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణ అందరి బాధ్యత అన్నారు క్షయ వ్యాధి బారినపడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. వ్యాధిగ్రస్తు లు పోషకాహారంతోపాటు మందులను వాడాలన్నా రు. ప్రతిరోజూ పౌష్టికాహా రం తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగు తుందన్నారు. క్షయ వ్యా ధిపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అందరి చేత క్షయ వ్యాధి నిర్మూలన ప్రతిజ్ఞ చేయిం చారు. వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వైద్య విద్యార్థులకు మెమొంటోలు ప్రశంసా పత్రాలు బహుకరించారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు వై టీ నాయుడు డాక్టర్ పి సురేష్ లైన్స్ క్లబ్ వాకర్స్ క్లబ్ సభ్యులు సిబ్బంది టిబి సూపర్వై జర్లు పాల్గొన్నారు.

Related Articles

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లాలో రైతుల కోసంవైయస్‌ఆర్‌సీపీ నేతలు పోరు బాట

రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ అన్నదాతలతో కలిసి కలెక్టరేట్‌కి ర్యాలీగా వైయస్‌ఆర్‌సీపీ నేతలు V9 ప్రజా ఆయుధం దినపత్రిక – అమలాపురం డిసెంబర్ 13 అన్న దాతకు అండగా…ర్యాలీలో పాల్గొన్న జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ […]

రేపటి నుంచే వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ గవర్నెన్స్ పై. సీఎం చంద్రబాబు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. మొదటి విడతగా […]

హెచ్ ఐ వి /ఎయిడ్స్ మరియు డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం ఆగస్టు 12: హెచ్ ఐ వి /ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులపై అవగాహనా పెంచు కుందాం మరియు డ్రగ్స్ రహిత సమాజాన్ని […]

జీరో పేదరికమే లక్ష్యంగా పి 4 రీవాల్యుడేషన్ గ్రామ సభలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 25: జీరో పేదరికమే లక్ష్యంగా పి 4 రీవాల్యుడేషన్ గ్రామ సభలు రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి, అర్హులను వారి […]