10 వ తరగతి నుండి పీజీ వరకు జాబ్ మేళా గ్రేస్ డిగ్రీ కళాశాల పి.గన్నవరం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 24:

నిరుద్యోగులకు, ఉద్యోగా ర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు ఒకే వేదికపైకి వచ్చి నిర్వ హించే ఉద్యోగ నియామక ప్రక్రియ జాబ్ మేళా ను సద్వి నియోగం చేసుకోవాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళ వారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ నందు జాబ్ మేళా ప్రచార పత్రికను ఆవిష్కరించారు. ఈనెల 28 వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా వికాస కేంద్రం, నైపుణ్యాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పి గన్నవరం మండల కేంద్రం గ్రేస్ డిగ్రీ కళాశాల నందు తాహసిల్దార్ కార్యాలయం పక్కన సుమారు 10 కంపెనీల మానవ వనరుల అభివృద్ధి అధికారుల భాగస్వామ్యంతో జాబ్ మేళా నియోజకవర్గ స్థాయిలో నిర్వహించ డం జరుగుతుందన్నారు. కావున నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగ యువత యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవనోపాదులను పెంపొందించుకోవా లన్నారు. 10 వ తరగతి నుండి పీజీ వరకు చదివిన వారికి వివిధ స్థాయిలలో ఉద్యో గాలు పొందే వెసులు బాటు ఉందన్నారు. విద్యార్హత ధ్రువపత్రాలు పరిశీలన అనంతరం ఎటువంటి పరీక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజులు లేకుండానే కంపెనీల ప్రతి నిధులు అక్కడిక క్కడే అభ్యర్థులకు ముఖాముఖి ఇంటర్వ్యూ చేసి, ఎంపికైన వారికి నియమాకపు ఉత్తర్వులు జారీ చేస్తారన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు వెతుక్కోలేని వారికి, ఒకే చోట అనేక అవకాశాలను పొంద డానికి ఇదొక చక్కటి వేదిక న్నారు.అర్హులైన అభ్య ర్థులను గుర్తించి, వారికి ఉద్యోగాలు కల్పించడం,
నిరుద్యోగ యువతకు సరైన మార్గ నిర్దేశం చేస్తూ కంపె నీలకు అవసరమైన మానవ వనరులను అందించడం జాబ్ మేళా లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వికాస జిల్లా మేనేజర్ జి రమేష్, నైపు ణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరిశేషు తదితరులు పాల్గొన్నారు

Related Articles

వీటిని రాత్రిపూట అసలు తినకూడదు

ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం కచ్చితంగా తీసుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని ఆహారాలను రాత్రిపూట అసలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. చీజ్, కాఫీ, మసాలా పదార్థాలు, డ్రైఫ్రూట్స్, మాంసాహారంను తీసుకోకూడదు. అలానే కడుపు […]

కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు గత సంవత్సరం 785 మంది పై కేసులు.

సంక్రాంతి సందర్భంగా రికార్డింగ్ డాన్సులు నిషేధం : కలెక్టర్ మహేష్ కుమార్. V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం, జనవరి 09: ప్రభల తీర్థాలు నిర్వహించే ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ […]

పి ఆర్సి వెంటనే ప్రకటించాలి:ఏ పీ టీ ఎఫ్

రాష్ట్ర అధ్యక్షులు జి. హృదయరాజు డిమాండ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గా ఎస్ ఎన్ మునేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉందుర్తి వీర వెంకట్రావు ఏకగ్రీవ ఎన్నిక V9 […]

అనంతపురం జిల్లా కేంద్రంలో ఘనంగా జగన్మోహన్ జన్మదిన వేడుకలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం జగన్ పుట్టిన రోజు కేక్ కటింగ్ చేసిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీసీ విభాగం రీజనల్ కన్వీనర్ రమేష్ […]